GT Hemanth Kumar, Tirupathi, News18
Costly Cow: ఆవులందు ఈ ఆవులు వేరయా అనక తప్పదు. నిజంగానే ఈ ఆవు (Cow)లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అలాగని బాహుబలి (Bahubali).. ఎత్తుగా లావుగా ఏమీ ఉండవు.. జస్ట్ భూమికి మూడు అడుగులు మాత్రేమే ఉంటాయి.. అయినా మహా గట్టివి.. అదే పుంగనూరు ఆవు (Punganuru Cow) ల ప్రత్యేకత.. దేశంలోనే ప్రత్యేకమైనవిగా గుర్తింపు తెచ్చుకున్నాయి.. ప్రపంచ దేశాల్లో అనేక రకాల ఆవులు ఉన్నప్పటికి పుంగనూరు ఆవులకు ఉన్నంత గిరాకీ మరే ఆవులకి ఉండదు. సాధారణ ఆవుల మాదిరి కాకుండా, ఈ ఆవులు చూసేందుకు కేవలం మూడు అడుగుల పొడవుతో కలిగి ముద్దుగా, ఎంతో అందంగా ఉంటాయి.. సాధారణ ఆవులకు, పుంగనూరు ఆవులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మొదటి సారి ఈ ఆవులను చూసిన వారు ఎవరైనా సరే ఇది ఆవా, లేక దూడా అనే అనుమానం కలుగుతుంది.
మనిషి నమ్మే ఆవు జాతిలో పుంగనూరు ఆవులు మొదటి రకం జాబితాలో ఉంటాయి. అంతే కాకుండా ఈ ఆవులు వాసన పసిగడుతూ మార్గంలో వెళ్ళి, వాసనతోనే తిరిగి గమ్యంకు చేరుకోగల తెలివితేటలు కలిగినవి.. ఇక పోతే ఈ జాతి ఆవులు ఎంత ఉష్ణోగ్రతనైనా, ఎంతటి చలినైనా తట్టుకుని జీవించగల సామర్థ్యం కలిగినవిగా ఉంటాయి.
అసలు పుంగనూరు ఆవులు ఎంత పొడవు ఉంటాయంటే..? వీటి కాళ్లు పొట్టిగా ఉండి, ఎత్తు 70 నుంచి 90 సెంటీమీటర్లు ఉంటుంది.. సాధారణంగా ఇవి 2 అడుగుల 4 అంగుళాల నుంచి 3 అడుగుల వరకు ఎత్తు పెరిగి, 250 కేజీల బరువు కలిగి ఉంటాయి. అంతే కాకుండా నలుపు, బూడిద, తెలుపు రంగుల్లో ఈ జాతి ఆవులు కనిపిస్తాయి. ఎంతో విశాలమైన నుదురుతో చిన్నపాటి కొమ్ములు కలిగిన ఇవి, వీటి తోక మాత్రం నేలను తాకుతూ ఉండడమే ఈ ఆవుల స్పెషల్.
ఈ జాతి ఆవులు ఇచ్చే పాలల్లో అధిక శాతం ప్రోటీన్లు కలిగి చాలా చిక్కగా, రుచిగా ఉంటాయి. మామూలు ఆవు పాలలో 3.5 శాతం వెన్న ఉంటే ఈ ఆవు పాలలో 6 నుంచి 8 శాతం వెన్న ఉంటుంది. ఈ పాలు సుగంధ వాసనలతో, ఆయుర్వేద గుణాలతో ఉంటాయని పుంగనూరు ఆవు సంరక్షకులు చెబుతున్నారు. అంతే కాకుండా వీటికి జబ్బులను తట్టుకునే గుణం ఎక్కువగా ఉంటుందని, తక్కువ మేత మేయడంతో పాటుగా తక్కువ నీరు సేవిస్తుందని, వీటిని తక్కువ ఖర్చుతో పెంచవచ్చని అంటున్నారు.
ఇదీ చదవండి: బావిలో పడ్డ భారీ ఏనుగు.. రాత్రంతా అలాగే ఘీంకారాలు.. ఎలా బయటకు తీశారంటే?
పుంగనూరు జాతి ఆవుల ధర ఎంతో తెలిస్తే షాకే..!
పుంగనూరు జాతి ఆవులు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆశక్తి చూపుతుంటారు. 2007లో వీటి ధర కేవలం ముప్పై వేలకు పైగా ప్రస్తుతం వీటి ధర మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకూ పలుకుతోంది. ఈ జాతి ఆవులకు సాధారణ ఆవుల కంటే చిన్న చెవులు కలిగి ఉండి, ఆకర్షణీయంగా ఆవుకు పైభాగంలో మూపురం ఉంటుంది.
ఇదీ చదవండి: కాంతారా గా మారిన తహసీల్దార్.. కారణం ఏంటో తెలుసా..?
పుంగనూరు జాతి ఆవులపై రైతులు ఎందుకు ఆశక్తి చూపరంటే..?
అంతరించి పోతున్న పశుజాతుల్లో ఈ పుంగనూరు జాతి ఆవులు కూడా ఒక్కటి.. గతంలో ఈ పుంగనూరు ఆవులు అధిక సంఖ్యలో ఉన్నా, ప్రస్తుతం కేవలం వందల సంఖ్యలో మాత్రమే పుంగనూరులో ఉంటున్నాయి.. ఈ ఆవు పాల దిగుబడి తక్కువగా ఉంటుంది.. మిగతా ఆవుల పాల దిగుబడి ఎక్కువగా ఉండడంతో రైతులు ఈ జాతి ఆవులకు బదులు ఎక్కువగా పాలిచ్చే ఆవు జాతులపై మక్కువ చూపుతున్నారు. పుంగనూరు దేశవాళి ఆవులు చిన్న సైజులో ఉంటూ, పెద్ద గోపురంతో ఉండడం లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కొందరు.. దీంతో పుంగనూరు జాతి ఆవులను ఇంటి వద్ద పోషించుకుంటూ నిత్య పూజలు చేస్తుంటారు.. ఇలా పూజలు చేయడం ద్వారా అష్టైశ్వర్యాలతో తులతూగుతారని విశ్వాసం.
ఇదీ చదవండి: అన్నయ్యతో సహా వచ్చేయండి.. మాతో విలీనం కండి..! పవన్ కు మోదీ ఇదే చెప్పారా..?
. అంతే కాకుండా బడా పారిశ్రామిక వేత్తలు ఫ్యాషన్ గా పుంగనూరు ఆవులను, ఇంటి వద్ద, గెస్ట్ హౌస్ ల వద్ద పెంచుకుంటున్నారు.. దీంతో పుంగనూరు ఆవులను వ్యాపార పేక్షగా చేస్తున్నారు కొందరు. పుంగనూరు జాతి ఆవుల పాలను పిల్లలకు అందించడం ద్వారా బలం చేకూరుతుందని, వీటి పేడను ఇండ్లల్లో ధూపం వేసేందుకు ఉపయోగిస్తున్నామని పుంగనూరు పెంపకందారులు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chittoor, Cow