Home /News /andhra-pradesh /

VERY ATTRACTION CHILD PAINTS IN FARMERS EXHIBITION IN ANATAPURAM FOR FUTURE GENERATION NGS ASN NJ

Farmers Exhibition: కళ్లకు కట్టినట్టు సాగు కష్టాలు.. భావితరాలకు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న ఎగ్జిబిషన్

భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా వ్యవసాయ ఎగ్జిబిషన్

భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా వ్యవసాయ ఎగ్జిబిషన్

Farmers Exhibition: ఈ రోజుల్లో వ్యవసాయం అంటే ఎవరూ ముందుకు రావడం లేదు.. ఎంత శ్రమించినా.. ఫలితం ఉండడం లేదు.. వ్యవాసయానికి పెట్టిన పెట్టుబడి కూడా రాక.. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాభావ ప్రభావంతో పూర్తిగా పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఎవరూ అటు వైపు మొగ్గు చూపడం లేదు. ఇక రాయలసీమలో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ కష్ట నష్టాలు భవిష్యత్తుకు తెలియచేసేందుకు.. ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

ఇంకా చదవండి ...
    Ananthapuram, News18, Sriram Nayak.

    Farmers Exhibition: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యవసాయాధారిత రాష్ట్రం.. వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాల్లో పంట పూర్తిగా చేతికి రావడం లేదు.. అన్నదాతలకు కష్టాలు.. అప్పులు తప్పడం లేదు. ముఖ్యంగా అనంతపురం జిల్లా (Anantapuram District) లో వ్యవసాయ పరిస్థితులు మరీ దారుణంగా ఉంటున్నాయి.  అక్కడ వ్యవసాయ పరిస్థితులు ఇలా మారడానికి కారణం ఏంటి..? ఇవన్నీ భవిష్యత్తు తరాలకు తెలియాలనే ఉద్దేశంతో.. అనంత రైతు కష్టాల సాగు' ఫొటోఎగ్జిబిషన్  (Photo Exhibition )నిలిచింది. ఈ ఎగ్జిబిషన్ లో అనంతలో వ్యవహసాయ రంగం ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు అన్నీ కళ్లకు కట్టినట్టు ఎగ్జిబిషన్ లో ఫోటోలు పెట్టారు. ప్రతి ఒక్కరినీ వ్యవసాయం గురించి ఆలోచింపజేశాయి. అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి ఏపి రైతు సంఘం (AP Former Association) 22వ మహాసభలు నిర్వహిస్తోంది. ఈ నెల 30వ తేదీ మధ్య అనంతపురంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం వివిధరకాల కార్యక్రమాలను చేపట్టింది. దీనిలో భాగంగా 'అనంత రైతు కష్టాల సాగు' ఫొటో ఎగ్జిబిషన్ అనంతపురం ఆర్ట్స్ కళాశాల కామర్సు ఆవరణంలో ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, దిశా డిఎస్పి ఎ.శ్రీనివాసులు, ట్రాఫిక్ డిఎస్పి ప్రసాద్రెడ్డి ప్రారంభించారు.

    అంతర్జాతీయంగా వ్యవసాయ పరిస్థితులు అందరికీ అర్థమయ్యే విధంగా ఈ ప్రదర్శన పెట్టారు. రాయలసీమ ప్రాంతంలో కరువుకు గురయ్యే జిల్లాల జాబితాలో మొదటి స్థానంలో అనంతపురం జిల్లా రెండవ స్థానంలో కర్నూలు జిల్లా ఎప్పుడు తీవ్ర కరువు ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ తరుణంలో భారత శానికి స్వతంత్రం రాక ముందు నుంచి ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో రైతులు పడుతున్న బాధలు సమస్యలను కళ్ళకు కట్టినట్లుగా విద్యార్థులు రైతు ఉద్యమాల నాయకుల చిత్రాలను చిత్రీకరించారు.

    ఇదీ చదవండి : పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లు.. అధికార పార్టీకి వార్నింగ్ లు.. టీడీపీ యువ నేతల జోష్ కారణం ఇదే?

    తరచూ ఖరీఫ్  సీజన్ లో ఎక్కువగా  వేరు శనగ పంటను వేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా అనుకున్న స్థాయిలో వర్షాలు పడక, వర్షాలు పడినా సకాలంలో పడక.. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  కరువు ప్రాంతంలో వాతా వరణ ప్రభావం వల్ల అక్కడి ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయం అంతర్జాతీయంగా, జాతీయంగా, జిల్లాలో ఏ రకంగా ఉందన్న అంశాలను ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు.

    ఇదీ చదవండి : తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు.. రికార్డు స్థాయిలో పోటెత్తిన భక్తులు.. ఎందుకంత డిమాండ్?

    నాలుగు స్టాల్స్ గా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రపంచంలో పండే పంటలు.. అక్కడి వ్యవసాయ విధనాలు.. స్పష్టంగా ఎగ్జిబిషన్ ద్వారా అందరికీ వివరిస్తున్నారు. వివిధ దేశాలు ఏ పంటలను వేస్తున్నాయి అనే అంశాలను చార్ట్లరూపంలో ప్రదర్శించారు.

    ఇదీ చదవండి : చంద్రబాబు అనూహ్య నిర్ణయం ఫలితాలను ఇస్తోందా.. డోన్ ప్రకటన తరువాత నేతల్లో మార్పు

    ఈ ఎగ్జిబిషన్ లో రైతుల స్థితిగతులను తెలిపే విధంగా పలు అంశాలను వివరిస్తూ ఛార్టుల్లో గీసిన బొమ్మలు ప్రత్యేకంగాని లిచాయి. ఇది విద్యార్థుల్లో ఉన్న సృజనకు నిదర్శనమని ఎగ్జిబిషన్ ను తిలకించిన వారు ప్రశంసిస్తున్నారు. సుమారు 80 మంది విద్యార్థులు ఈ విధంగా బొమ్మలు వేసి వారి ప్రతిభను చాటుకున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Farmers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు