మంత్రులుగా ప్రమాణం చేసిన వేణుగోపాల్, అప్పలరాజు

శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదరి అప్పలరాజు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాల్ కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేశారు.

news18-telugu
Updated: July 22, 2020, 3:57 PM IST
మంత్రులుగా ప్రమాణం చేసిన వేణుగోపాల్, అప్పలరాజు
మంత్రులుగా ప్రమాణం చేసిన వేణుగోపాల్, అప్పలరాజు
  • Share this:
ఏపీలో కొత్త మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదరి అప్పలరాజు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాల్ కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేశారు. ముందుగా రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాల్ ప్రమాణం స్వీకారం చేయగా... అనంతరం సిదరి అప్పలరాజు మంత్రిగా ప్రమాణం చేశారు. కోవిడ్ 19 నిబంధనల కారణంగా కేవలం అతికొద్ది మంది మంత్రులు, కొత్త మంత్రుల కుటుబసభ్యులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే ఇద్దరు మంత్రులు ప్రమాణం చేశారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఈ కార్యక్రమం ముగిసింది.

గతంలో ఏపీ మంత్రులుగా వ్యవహరించిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నిక కావడంతో... వారి స్థానంలో వేణుగోపాల్, అప్పలరాజుకు కేబినెట్‌లో చోటు దక్కింది. ఇక శాఖల కేటాయింపు విషయంలోనూ కొద్దిపాటి మార్పులతో వారికి అవే శాఖలు దక్కొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కీలకమైన రెవెన్యూశాఖతో పాటు ఉపముఖ్యమంత్రి పదవి మాత్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్‌కు సీఎం జగన్ కట్టబెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రానికి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు పలువురు మంత్రుల శాఖ మార్పుకు సంబంధించి సీఎంవో ప్రకటన విడుదల చేయనుంది.
Published by: Kishore Akkaladevi
First published: July 22, 2020, 1:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading