#MissionPaani | నీటి పరిరక్షణకు నడుంకట్టిన పల్నాడు పల్లె... ఐక్యమత్యంతో నీటికొరతకు చెక్

#MissionPaani | నీటి పరిరక్షణకు నడుంకట్టిన పల్నాడు పల్లె... ఐక్యమత్యంతో నీటికొరతకు చెక్

నీటి గుంతలు ఏర్పాటు చేస్తున్న గ్రామస్థులు

తాము చేసిన పొరపాటును సరిదిద్దుకోవటానికి గ్రామంలో ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్ కు డ్రిల్లింగ్ చేసి ప్రతి ఇంటి ముందు ఒక మొక్కని నాటాలని సంకల్పించి గ్రామం మొత్తం ప్రతి ఇంటి ముందు ఒక మొక్కను నాటారు.

 • Share this:
  సృష్టి లోని సర్వకోటి జీవులకు నీరు ఎంతో ప్రధానమైనది కానీ ఆ నీటిని భవిష్యత్ తరాలకు అందించటంలో ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నీటిని పొదుపు చేయడం అనేది జీవన సమతుల్యానికి ఎంతో అవసరం. భూమి మీద ఉన్న అతి తక్కువ సురక్షిత మరియు త్రాగు నీటి శాతాన్ని అంచనా వేయడంద్వారా నీటిని పరిరక్షించే ఉద్యమాలు మన అందరికీ అతి ముఖ్యమైనవి.  పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి . నీటి ఆదాను మరింత సమర్ధవంతంగా తీసుకురావడానికి అన్ని పారిశ్రామిక భవనాలు, భవంతులు, పాఠశాల, ఆస్పత్రులు, మొదలగువాటిలో నిర్మాణసంస్థల ద్వారా నీటి నిర్వహణ వ్యవస్థలను ప్రోత్సహించాలి. సామాన్య ప్రజలకు నీటి కొరత వల్ల వచ్చే సమస్యలగురించి తెలియచేసే కార్యక్రమాలు అమలు చేయాలి.

  పల్నాడు ప్రాంతంలో వెల్దుర్తి గ్రామంలోని ప్రజలు కృష్ణ నది ఫై నిర్మించిన నాగార్జున సాగర్ కు కూతవేటు దూరం లో ఉండి కూడా తాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు . వెల్దుర్తి గ్రామ వాసులు తాము చేసిన పొరపాట్లు దిద్దుకొని గ్రామప్రజలు ఐక్యమత్యంతో ప్రతి ఇంటి ముందు ఒక చెట్టును నాటి నీటి పొదుపు పద్దతులను అనుసరిస్తున్నారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామంలో సిమెంట్ రోడ్లతో నింపివేసారు. దీంతో వర్షాకాలంలో వర్షపు నీరు భూమి లలోకి ఇంకి పోకుండా పల్లం వైపు వెళ్లడంతో వెల్దుర్తి గ్రామం భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. గత వేసవి కలం లో తాగునీటికి ఎన్నో వ్యయప్రయాసలకు గురయ్యారు.

  దింతో తాము చేసిన పొరపాటును సరిదిద్దుకోవటానికి గ్రామంలో ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్ కు డ్రిల్లింగ్ చేసి ప్రతి ఇంటి ముందు ఒక మొక్కని నాటాలని సంకల్పించి గ్రామం మొత్తం ప్రతి ఇంటి ముందు ఒక మొక్కను నాటారు. అధేవిధంగా ప్రతి బజారులో ఒక ఇంకుడు గుంతను ఏర్పాటు చేసి ఉపయోగించిన మరియు వర్షపు నీటిని ఇంకుడు గుంతలకు మళ్లించారు.గ్రామస్థులందరు ఐకమత్యంతో నీటి పరిరక్షణకు ముందడుగు వేశారు. దీంతో ఆ ఊరిలో ఇప్పుడు నీటి సమస్యకు చెక్ పెట్టినట్లు అయ్యింది.

  వెల్దుర్తిలోనే కాదు... ప్రజలు వర్షపు నీటిని వినియోగించే విధానాన్ని గ్రామ స్థాయిలో ప్రారంభించాలి. సరైన నిర్వహణతో చిన్న లేదా పెద్ద చెరువులు తవ్వడం ద్వారా వర్షపు నీటిని పొదుపు చేయవచ్చును. ప్రజలు నీటి సమస్యలు, పరిష్కారాలపై దృష్టి సారించడం ఎంతో అవసరం. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో నీటి అభద్రత మరియు నీటి కొరత ప్రజల జీవనాన్ని ప్రభావితం చేస్తోంది. రాబోయే దశాబ్దాలలో ఈ పరిస్థితి మరింత దిగజారవచ్చును ఎందుక్సంటే జనాభా, వ్యవసాయం, పరిశ్రమలు మొదలగునవి పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి జనం ఇప్పుడే... మేల్కొని.. ప్రతీ ఊరు కూడా నీటికొరతకు చెక్ పెట్టి.. నీటి పరిరక్షణకు నడుం బిగించాలని ఆశిద్దాం.

  (రఘు అన్నా, న్యూస్ 18 తెలుగు, గుంటూరు ప్రతినిధి)
  First published: