హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అక్రమ మద్యంపై ఉక్కుపాదం.. ఏపీ అధికారుల సంచలన నిర్ణయం

అక్రమ మద్యంపై ఉక్కుపాదం.. ఏపీ అధికారుల సంచలన నిర్ణయం

ఈ నేపథ్యంలోనే కొందరు మందుబాబులు పక్క రాష్ట్రాలకు వెళ్లి మరీ మద్యం తాగి వస్తున్నారు. అదే సమయంలో పెద్ద సంఖ్యలో మందు బాటిళ్లను కూడా తమ వెంట అక్రమంగా తెచ్చుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే కొందరు మందుబాబులు పక్క రాష్ట్రాలకు వెళ్లి మరీ మద్యం తాగి వస్తున్నారు. అదే సమయంలో పెద్ద సంఖ్యలో మందు బాటిళ్లను కూడా తమ వెంట అక్రమంగా తెచ్చుకుంటున్నారు.

గత మూడున్నర నెలల్లో 3,683 అక్రమ మద్యం రవాణా కేసులు నమోదు చేశామని.. 2180 వాహనాలను సీజ్ చేసి రూ.4 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు

  ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. లిక్కర్ ధరలను భారీగా పెంచేసింది. దుకాణాలను కూడా తగ్గించింది. అంతేకాదు ఏఫీలో బ్రాండెడ్ మద్యం బాటిళ్లు అస్సలు దొరకవు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఏపీకి అక్రమ మద్యం ఏరులై పారుతోంది. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నా..మద్యం అక్రమ రవాణా ఆగడం లేదు. నిత్యం వేలాది మద్యం సీసాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో అక్రమ మద్యం రవాణాపై ఏపీ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యం తరలిస్తూ పట్టుబడిన వాహనాలను బహిరంగంగా వేలం వేస్తామని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మంగళవారం కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలోని గంగినేని సహా పలు చెక్‌పోస్టులను సందర్శించారు.

  అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. జిల్లా వ్యాప్తంగా కొన్ని నెలలుగా SEB ఆధ్వర్యంలో మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. గత మూడున్నర నెలల్లో 3,683 అక్రమ మద్యం రవాణా కేసులు నమోదు చేశామని.. 2180 వాహనాలను సీజ్ చేసి రూ.4 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అంతేకాదు పరివర్తన కార్యక్రమం ద్వారా నాటుసారా తయారు చేసే వారి కుటుంబాల్లోని యువతకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించామని చెప్పారు వకుల్ జిందాల్. చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ సరిహద్దుల నుంచి భారీగా అక్రమ మద్యం వస్తోందని.. దానికి అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Liquor sales, Liquor shops, Wine shops

  ఉత్తమ కథలు