Home /News /andhra-pradesh /

VARLA RAMAIAH QUESTIONS CM YS JAGAN ON YS VIVEKA MURDER CASE ENQUIRY STATUS AK

వివేకా హత్య కేసు పురోగతి ఏంటి ?.. జగన్‌కు టీడీపీ నేత ప్రశ్న

వైఎస్ వివేకానంద రెడ్డి (File)

వైఎస్ వివేకానంద రెడ్డి (File)

YS Viveka Murder Case: విపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ స్వయంగా వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకు ఇవ్వాలని డిమాండ్ చేసింది నిజం కాదా ? అని వర్ల రామయ్య అన్నారు.

    సోషల్ మీడియా లాంటి చిల్లర కేసులకిచ్చిన ప్రాధాన్యత వైసీపీ ప్రభుత్వం వైఎస్ వివేకా హత్య కేసుకు ఇవ్వడం లేదని టీడీపీ సీనియర్ వర్ల రామయ్య ఆరోపించారు. ఏడాది క్రితం జరిగిన వివేకా హత్య కేసు పురోగతి ఏమిటని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ స్వయంగా వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకు ఇవ్వాలని డిమాండ్ చేసింది నిజం కాదా ? అని వర్ల రామయ్య అన్నారు. హైకోర్టు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత మీ ప్రభుత్వం దర్యాప్తును ఎంతవరకు పరిశీలించిందని వర్ల రామయ్య ప్రశ్నించారు. హైకోర్టు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించి 100 రోజులు దాటినా సీబీఐ దర్యాప్తు పురోగతి ఏంటని ? ఇప్పటి వరకు జరిగిని దర్యాప్తుపై సీబీఐ ఒక ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

    సీబీఐ వర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం జగన్ కేంద్ర హోంమంత్రికి, ప్రధానికి లేఖ రాయాలని కోరారు. వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీత కూడా దర్యాప్తు పురోగతి వెల్లడించాలని సీబీఐకి లేఖ రాయాలని అన్నారు. హైకోర్టు సైతం ఈ కేసులో ఇప్పటి వరకూ జరిగిన పురోగతిపై సీబీఐని రిపోర్టు అడగాలని విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ర్ట ప్రభుత్వ ప్రాధాన్యతలు ఆందోళన కలిగిస్తున్నాయని వర్ల రామయ్య విమర్శించారు.




    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Varla ramaiah, Ys viveka murder case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు