Home /News /andhra-pradesh /

VANGAVEETI RADHAKRISHNA CONFUSING POLITICAL PARTIES AND SHOCK TO TDP AND BOOST TO JANASENA IN VIJAYAWADA AK

Vangaveeti Radhakrishna: తికమక పెడుతున్న వంగవీటి రాధా.. టీడీపీకి షాక్.. జనసేనలో జోష్

వంగవీటి రాధాకృష్ణ (ఫైల్ ఫోటో)

వంగవీటి రాధాకృష్ణ (ఫైల్ ఫోటో)

Vangaveeti Radhakrishna: వివిధ పార్టీల అభ్యర్థులకు ప్రచారం చేస్తున్న వంగవీటి రాధా.. టీడీపీకి షాక్ ఇవ్వడంతో పాటు జనసేనలో జోష్ నింపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు విజయవాడలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వంగవీటి రంగా తనయుడిగా కాపు వర్గంలో ఆయనకు ఇప్పటికీ ఫాలోయింగ్ ఉంది. ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ఆయన ఇమేజ్‌ను ఇప్పటికీ రాజకీయ పార్టీలు ప్రత్యేకంగానే చూస్తుంటాయి. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న వంగవీటి రాధా.. ఆ పార్టీలో అంత యాక్టివ్‌గా లేకపోయినప్పటికీ.. తనకు అక్కడ ప్రాధాన్యత ఉందనే భావనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే ఆయన ఇంకా టీడీపీలో కొనసాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. త్వరలో జరగబోయే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వంగవీటి రాధా టీడీపీకి పూర్తిగా మద్దతు ఇస్తారా ? లేదా ? అన్నది విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ రావడం లేదు.

    టీడీపీ మేయర్ అభ్యర్థిని కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసిన రాధా.. కొన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కూడా చేపట్టారు. అయితే కొన్ని చోట్ల ఆయన జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లకు కూడా మద్దతు తెలపడం.. వారి ప్రచారంలో పాల్గొనడటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వంగవీటి రంగా ఫోటోలను విజయవాడలోని అన్ని పార్టీలు తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి.

    ఇక రాధా సైతం తనకు సన్నిహితులుగా ఉన్న వాళ్లు వివిధ పార్టీలు, ఇండిపెండెంట్లుగా పోటీ చేసినా ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ తరపున పోటీ చేస్తున్న వారికి మాత్రం రాధా మద్దతు తెలిపిన సందర్భాలు లేవు. మరోవైపు వంగవీటి రాధా కొన్ని చోట్ల తమకు మద్దతు ప్రకటించడం జనసేన అభ్యర్థుల్లో జోష్ నింపుతోంది. ఆయన ప్రచారం తమకు ఎంతగానో కలిసొస్తుందని పలువురు అభ్యర్థులు భావిస్తున్నారు. మొత్తానికి వివిధ పార్టీల అభ్యర్థులకు ప్రచారం చేస్తున్న వంగవీటి రాధా.. టీడీపీకి షాక్ ఇవ్వడంతో పాటు జనసేనలో జోష్ నింపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Janasena, Tdp, Vangaveeti Radha, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు