వాల్మీకి మూవీ షాక్... సినిమా విడుదల చేయొద్దని కలెక్టర్ల ఆదేశాలు

వాల్మీకి సంఘాల ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

news18-telugu
Updated: September 19, 2019, 8:54 PM IST
వాల్మీకి మూవీ షాక్... సినిమా విడుదల చేయొద్దని కలెక్టర్ల ఆదేశాలు
వాల్మీకి పోస్టర్
  • Share this:
వాల్మీకి మూవీ విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కాబోతోంది. టైటిల్‌పై ఇప్పటికే పలు సంఘాల నుంచి అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో సినిమా విడుదలపై సందిగ్ధం నెలకొంది. ఐనప్పటికీ వాల్మికీ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు స్పష్టంచేశారు. వాల్మీకీలను కించపరిచేలా ఎలాంటి సన్నివేశాలు లేవని చెప్పారు. ఐతే సినిమా విడుదలకు కొన్ని గంటలకు ముందు వాల్మీకి టీమ్‌కు షాక్ తగిలింది. కర్నూల్, అనంతపురం జిల్లాల్లో సినిమాను ప్రదర్శించవద్దని థియేటర్ యాజమాన్యాలను కలెక్టర్లు ఆదేశించారు.

వాల్మీకి సంఘాల ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కలెక్టర్లు. కాగా, 2014లో వచ్చిన తమిళ్ మూవీ 'జిగర్ తాండా'కు రీమేక్‌గా వాల్మీకిని నిర్మించారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అతర్వా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాలో గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ కనిపించబోతున్నాడు. నితిన్ గెస్ట్‌రోల్‌లో మెరవబోతున్నాడు. వరుణ్ వెరైటీ గెటప్‌‌తో పాటు ట్రైలర్ రిలీజ్ తర్వాత వాల్మీకి మూవీపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.
First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading