తిరుమలలో భక్తుల రద్దీ... ఉత్తర ద్వారం నుంచీ శ్రీవారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ... ఉత్తర ద్వారం నుంచీ శ్రీవారి దర్శనం

లాక్‌డౌన్ అనంతరం శ్రీవారి ఆలయంలో దర్శనాలకు అనుమతించిన తరువాత ఇంత తక్కువ స్థాయిలో భక్తులు స్వామిని దర్శించుకోవడం ఇదే తొలిసారి.

Vaikunta Ekadasi 2020 : నేడు వైకుంఠ ఏకాదశి, రేపు ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సర్వదర్శనాన్ని త్వరగా ప్రారంభించారు.

 • Share this:
  Vaikunta Ekadasi 2020 : తిరుమలలో ఊహించినదాని కంటే ఎక్కువగా భక్తులు రావడంతో... వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు... సర్వదర్శనాన్ని త్వరగా ప్రారంభించారు. ఉదయం 4.10 నుంచే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. నిన్న సాయంత్రం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ప్రవేశించిన భక్తులకు ఇప్పుడు దర్శన భాగ్యం కలుగుతోంది. ఇవాళ 1.9 లక్షల మంది భక్తులకు దర్శనభాగ్యం కలిగేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. లక్ష మంది భక్తులు వేచి ఉండేలా షెడ్లు నిర్మించింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్యులు, వీఐపీలు ఏటా పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ ఏడాది కూడా అదే జరుగుతోంది. తిరుమలతోపాటూ... తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వైష్ణవాలయాలూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

  తిరుమలలో భక్తుల రద్దీ... ఉత్తర ద్వారం నుంచీ శ్రీవారి దర్శనం


  వైకుంఠ ఏకాదశి నాడు... ముక్కోటి దేవతలతో శ్రీమహావిష్ణుమూర్తి దర్శనమిస్తారని ప్రతీది. అందువల్ల ఇవాళ స్వామి వారిని దర్శించుకుంటే సర్వ పాపాలూ తొలగిపోయి... అష్టైశ్వర్యాలూ కలుగుతాయని భక్తుల విశ్వాసం. అదీకాక... వైకుంఠ ద్వార ప్రవేశంతో పాటు స్వామివారి గర్భాలయ ప్రాకారాన్ని స్పృశించే భాగ్యం ఇవాళ భక్తులకు కలుగుతుంది. నేడు శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమిస్తారు. ఇక ద్వాదశి పర్వదినాన వేకువ జామున స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. రేపు పుష్కరిణిలో స్నానమాచరిస్తే పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల నమ్మకం.

  తిరుమలలో భక్తుల రద్దీ... ఉత్తర ద్వారం నుంచీ శ్రీవారి దర్శనం


  వైకుంఠ ఏకాదశి సందర్భంగా... 12 టన్నుల పుష్పాలతో తిరుమల ఆలయం, అనుబంధ ఆలయాలను అలంకరించారు. వైకుంఠాన్ని తలపించేలా విద్యుద్దీపాలతో ఏడుకొండలు జిగేల్ మంటున్నాయి. వాహన మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. 5 నుంచి 8 వరకు ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు, టైమ్‌స్లాట్, దివ్యదర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ద్వాదశి నాడు మాత్రం 2,500 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో భక్తులకు కేటాయించింది. ఇవాళ, రేపు సర్వదర్శనం ద్వారానే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. మొత్తం 43 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కలగనుంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ పూర్తిగా నిండిపోగా... నారాయణగిరి ఉద్యానవనం వరకూ భక్తుల క్యూ ఉంది.
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు