Home /News /andhra-pradesh /

UTTARANDHRA FAMOUS TEMPLE SRI SRI SRI VARAHALAXMI NARSIMHA SWAMY TEMPLE CANCELED GIRI PRADAKSHINA NGS

Simhachalam: వరాహలక్ష్మీనృసింహస్వామివారి భక్తులకు బ్యాడ్ న్యూస్.. సింహాచలంలో గిరి ప్రదక్షిణ రద్దు

సింహాచలం ఆలయం (ఫైల్)

సింహాచలం ఆలయం (ఫైల్)

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంపై కరోనా ప్రభావం భారీగానే పడింది. దీంతో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారుల. ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే గిరి ప్రదక్షిణను రద్దు చేశారు..

    తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాయాలపై కరోనా ఎపెక్ట్ పడింది. ఇప్పటికీ పుణ్య క్షేత్రాల్లో భక్తులను అనుమతించే విషయంలో కఠిన నిబంధనలు కొనాసగుతున్నాయి. ముందుగా బుక్ చేసుకున్నవారికి మాత్రమే దర్శనానికి అవకాశం ఇస్తున్నారు. దీంతో గతంతో పోల్చుకుంటే అన్ని దేవాలయాల్లో భక్తుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. ఉత్తరాంధ్ర వాసుల ప్రధాన పుణ్యక్షేత్రం సింహాచలంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ ఇంకా కొనసాగూతే ఉంది. ఈ నేపథ్యంలో సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ రద్దుచేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నైట్ కర్ప్యూ అమల్లో ఉన్నందును ఆషాఢ పౌర్ణమి రోజు.. జులై23న, సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి గిరి ప్రదక్షిణ రద్దు చెస్తున్నట్లు ఈవో సూర్యకళ చెప్పారు.

    కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని… భక్తులెవ్వరూ పగటి పూట కూడా గిరి ప్రదక్షిణ చేయవద్దని కోరారు. ఈ నెల 23, 24వ తేదీల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుదని.. 23వ తేదీన శ్రీస్వామివారి మాస జయంతి… 24వ తేదీన తుది విడత చందన సమర్పణ ఉంటాయని ఈవో తెలిపారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Hindu Temples, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు