Pawan Kalyan: వినాయక చవితి పూజలో స్వదేశీ.. పవన్ కళ్యాణ్ పిలుపు

Pawan Kalyan on Vinayaka Chaviti Pooja: వినాయక చవితి పూజ నుంచి విదేశీ వస్తువులను పక్కన పెడతామని పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

news18-telugu
Updated: August 21, 2020, 2:31 PM IST
Pawan Kalyan: వినాయక చవితి పూజలో స్వదేశీ.. పవన్ కళ్యాణ్ పిలుపు
పవన్ కళ్యాణ్, జనసేన అధినేత
  • Share this:
Pawan Kalyan News: ప్రజల దేశభక్తిని ఈసారి వినాయక చవితి పండగలో ప్రతిబింబి చేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మనకు తెలియకుండానే విదేశీ వస్తువులు మన జీవనంలో భాగమైపోతున్నాయని.. మన కార్మికులు శ్రమించి రూపొందించిన వస్తువులకు మార్కెట్ లేకుండా పోతోందని ఆయన అన్నారు. మన వినాయక పూజలో సైతం విదేశీ పూజాద్రవ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ పూజ నుంచి అయినా విదేశీ వస్తువులను పక్కన పెడతామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం మన నేలపై తయారైన వస్తువులనే వాడదామని కోరారు.

ఇలా చేయడం ద్వారా మన దేశ ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధికి దోహదం చేసినట్టు అవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. మన దేశంలో ఉత్పత్తి చేసిన పర్యావరణ హితమైన పూజాద్రవ్యాలతోనే ఈసారి పండగ జరుపుకుందామని విజ్ఞప్తి చేశారు. కరోనా అనే భయంకరమైన విఘ్నం నుంచి దేశ ప్రజలందరినీ కాపాడమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
Published by: Kishore Akkaladevi
First published: August 21, 2020, 2:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading