Andhra America Marriage: ప్రేమకు కులాలు, మతాలు, జాతుల వ్యత్యాసాలు ఉండవని మరోసారి రుజువైంది. స్నేహితుల మధ్య ప్రేమ చిగురిస్తే.. ముందు వెనుక ఏమీ ఆలోచించరు.. తమ ప్రేమను పెళ్లి పీటలెక్కించి సుఖాంతం చేసుకుంటుంటారు కొంతమంది యువతీ యువకులు. అలాంటి ఓ జంట తమ స్నేహాన్ని కాస్త ప్రేమగా మార్చుకొని, వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. తమ ప్రేమకు కులాలు, జాతులు ఇలాంటివేవీ అడ్డురావని నిరూపించి దేశ హద్దులు చెరిపేసి ఏడు అడుగులు నడిచారు. ప్రేమకు హద్దులు ఉండవని దేశాలు, ఖండాంతరాలు కూడా ఉండవని అంటుంటారు. సరిగ్గా అలాంటి ఓ ప్రేమ వివాహ బంధంతో ఒకటయింది. ఆంధ్రా అబ్బాయి.. అమెరికా అమ్మాయి జంట..
అమెరికాలో ఎమ్మెస్ చేసిన యువకుడు.. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆ యువుకుడు చదవుకుంటున్న సమయంలో యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తరువాత ప్రేమగా మారింది. తమ ప్రేమకు పెద్దలు అంగీకరిస్తారో లేదో అని భయపడ్డారు.. కానీ ఎలాగైనా పెద్దలను ఒప్పించే ఒక్కటి అవ్వాలి అనుకున్నారు.. చివరికి ఇరువురి పెద్దలను ఒప్పించి మరీ వారి సమక్షంలోనే.. హిందూ వివాహ సంప్రదాయ పద్దతిలో మూడు ముళ్ల బంధంతో భార్యాభర్తలుగా కొత్త జీవితం ప్రారంభించారు.
విజయనగరం జిల్లా (Vizianagaram District) రాజాం పట్టణానికి చెందిన కందుల కిరణ్ (Kandula Kiran) అమెరికా (America) లో ఎమ్మెస్ చేసి తరువాత అక్కడే ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు. తనతో పాటు చదువుకున్న అమెరికా అమ్మాయి మహి అనే యువతితో ఉన్న స్నేహాం కాస్త ప్రేమగా మారింది. దీంతో వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపడం, పెళ్లికి కూడా ఓకే అనడంతో అమెరికాలోనే క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.
ఇదీ చదవండి : కర్మఫలం అనుభవించక తప్పదు.. రాహుల్‌పై విజయ సాయిరెడ్డి సెటైర్లు
భారతీయతను, ఇక్కడి హిందూ సాంప్రదాయాలను ఇష్టపడే మహి.. మరోసారి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుందామని కోరడంతో.. తన స్వగ్రామమైన రాజాం పట్టణంలో పెళ్లికి సిద్దమయ్యారు. కిరణ్ తన భార్య మహిని తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. ఆమెతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా రాజాం వచ్చారు. దీంతో రెండు కుటుంబాల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెద్దలు, బంధుమిత్రుల ఆశీర్వచనాలతో రాజాంలో ఘనంగా కిరణ్-మహి జంట వివాహం చేసుకున్నారు.
ఈ వివాహ వేడుకలో మహి తల్లిదండ్రులు సైతం సంప్రదాయ దుస్తుల్లో మెరిసి సందడి చేసారు. తమ అల్లుడు, కూతురు నుంచి ఆశీర్వదించారు. పెళ్లికి వచ్చిన బంధువులు సంతోషంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. మొత్తానికి ఖండాలు దాటిన ప్రేమ పెళ్లి భారతీయ సాంప్రదాయ పద్ధతిలో అందరినీ ఆకట్టుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Arrange marriage, Vizianagaram