Uppena Movie: విశాఖపై మనసు పారేసుకున్న ఉప్పెన బ్యూటీ : మెలోడిలో కృతిశెట్టి రచ్చ రచ్చ

విశాఖ అందాలపై మనసు పారేసుకుంది ఉప్పెన బ్యూటీ.. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇక్కడ పర్యాటక ప్రదేశాలు తనను మైమరచిపోయేలా చేశాయి అంటోంది అందాల భామ కృతిశెట్టి.

విశాఖ అందాలపై మనసు పారేసుకుంది ఉప్పెన బ్యూటీ.. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇక్కడ పర్యాటక ప్రదేశాలు తనను మైమరచిపోయేలా చేశాయి అంటోంది అందాల భామ కృతిశెట్టి.

  • Share this:
    ఉప్పెన టీం ఫుల్ జోష్ లో ఉంది. సినిమాకు భారీ కలెక్షన్లు రావడంతో టీం వరుసగా విజయోత్సవ ర్యాలీలు చేపడుతోంది. నేరుగా ప్రేక్షకులను కలుస్తూ సినిమాను ఆధరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే ఉప్పెన భామ కృతిశెట్టి మాత్రం వైజాగ్ ను చూసి మనసు పారేసుకున్నాను అంటోంది.

    ఉప్పెన చిత్రం షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతున్నప్పుడు ప్రేక్షకులు ఎంతోగానో ఆదరించారన్నారు. అప్పుడు ప్రేక్షకులు ఇచ్చిన మద్దతు మరిచిపోలేను అన్నారు. ముఖ్యంగా విశాఖ అందాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయంటోంది ఉప్పెన బ్యూటీ. సువిశీలమైన సముద్ర తీరం.. బీచ్ లో ఎగసి పడే అలలు.. ఇక్కడ పర్యాటక ప్రాంతాలు మనసుకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయని అన్నారు.. ఎప్పుడు అవకాశం వచ్చినా హ్యాపీగా విశాఖలో షూటింగ్ చేస్తాను అంటోంది కృతి.  అంతేకాదు ఇక్కడ అభిమానుల సైతం ఎంతో ఉత్సాహపరుస్తున్నారని.. వారు ఇచ్చిన ఉత్సాహం తనలో మరింత విశ్వాసాన్ని నింపుతోంది అన్నారు కృతిశెట్టి.

    ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించే దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో హీరోయిన్ కృతి శెట్టికి వరుస ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఉప్పెన బ్యూటీకి ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడ వెలువడింది. ఊరమాస్ సినిమాగా ఇది తెరకెక్కుతోందని నిర్మాత శ్రీనివాస్ ఇప్పటికే ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం జరుపుకునే ఈ చిత్రంలో కథానాయికగా కృతిశెట్టి ఎంపికైనట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు ఇప్పటికే పలువురు దర్శకుల నుంచి ఫోన్లు వస్తున్నట్టు టాక్.

    ఉప్పెన చిత్రం విజయోత్సవ ర్యాలీలో భాగంగా చిత్ర యూనిట్ మెలోడి థియేటర్‌లో సందడి చేసింది. హీరో వైష్ణవ్‌తేజ్, హీరోయిన్ కృతిశెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు, నటుడు క్రాంతి కుమార్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చి పలకరించారు. ప్రేక్షకులు కేరింతలు, చప్పట్లు, విజిల్స్‌తో థియేటర్‌ను హోరెత్తించారు. అక్కడ ప్రేక్షకుల ఉత్సహాన్ని చూసి మైమరిచిపోయాను అన్నారు వైష్ణవ్ తేజ్. తన తొలిచిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

    మంచి చిత్రం తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఉప్పెన నిరూపించిందని, ప్రతిఒక్కరికీ ధన్యవాదాలన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. సినిమా విడుదలైన రోజు నుంచే తన స్నేహితుల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌తో ఉక్కిరిబిక్కిరి అయ్యారన్నారు. ఉప్పెనతో వైజాగ్‌ పొంగుతోందని అనడంలోనే ఆయన సంతోషం అర్థమైందన్నారు బుచ్చిబాబు.

    ప్రేక్షకులతో కలిసి మెలోడి థియేటర్లో కాసేపు సినిమాను వీక్షించారు చిత్య యూనిట్ సభ్యులు. మరోవైపు ప్రేక్షకులు సైతం హీరో, హీరోయిన్లతో ఫోటోలు తీసుకోడానికి పోటీ పడ్డారు.. వారు థియేటర్లో ఉన్నంత సేపు ఫుల్ సందడి కనిపించింది.
    Published by:Nagesh Paina
    First published: