మంచి నీరు తాగుతూ ప్రాణం విడిచాడు..

మంచి నీరు తాగేందుకు వచ్చిన వ్యక్తి ఆ కుళాయి వద్దే ప్రాణాలు విడిచాడు.

news18-telugu
Updated: August 16, 2019, 8:39 PM IST
మంచి నీరు తాగుతూ ప్రాణం విడిచాడు..
గుత్తి రైల్వే స్టేషన్‌లో చనిపోయిన వ్యక్తి
  • Share this:
ఓ వ్యక్తికి దాహం వేసింది. నీటిని త్రాగడం కోసం దగ్గర ఉన్న కుళాయి వద్దకు వెళ్ళాడు. అలానే చనిపోయాడు. మంచినీటి కుళాయికి ఆనుకునే దేహాన్ని విడిచాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రైల్వేస్టేషన్లో జరిగింది. రైల్వే ఫ్లాట్ ఫాం పై కనిపించింది ఈ దృశ్యం. ఈ ఫోటోలో కనిపించే గుర్తు తెలియని వ్యక్తి నీరు త్రాగుతూ హఠాత్తుగా మృతి చెందాడు. ఉదయం ఎప్పుడో మృతి చెంది ఉన్నా రైల్వే సిబ్బంది మాత్రం పట్టించుకోలేదు. కొంత మంది కుళాయి దగ్గర ఉన్న ఆ మృతుడి ఫొటోను సోషల్ మీడియాలో పెట్టడం తో అధికారులు స్పందించారు. ఆ మృతదేహాన్ని తరలించారు. హృదయ విదారకంగా ఉన్న ఈ ఘటనను చూసిన వారు పాపం అనకుండా ఉండలేకపోయారు.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>