Sirisha Bandla: రేపే వర్జిన్ గెలాక్టిక్ ప్రయోగం.. అంతరిక్షంలోకి వెళ్తున్న తెలుగమ్మాయి శిరీష

శిరీష్ బండ్ల

కల్పానా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న రెండో భారతీయులు శిరీష బండ్ల కావడం విశేషం. అంతేకాదు అంతరిక్షంలోకి వెళ్తున్న ఫోర్త్ ఇండియన్‌గా చరిత్ర సృష్టించనున్నారు.

  • Share this:
    ఆంధ్రా అమ్మాయి అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్నారు. తెలుగు సంతతికి చెందిన శిరీషా బండ్ల రేపు నింగిలోకి వెళ్లబోతున్నారు. వర్జిన్ గెలాక్టిక్ 'యూనిటీ 22' ప్రయోగానికి సర్వం సిద్ధమయింది. న్యూ మెక్సికో నుంచి వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ వ్యోమనౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ యూనిటీ 22 పేరుతో ప్రయోగాన్ని చేపడుతోంది. ఇందులో ఆ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్, కంపెనీకి చెందిన మరో ఇద్దరు ప్రతినిధులతో పాటు తెలుగు యువతి, ఆ సంస్థ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలు శిరీష బండ్ల కూడా అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు. అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఓ వ్యోమనౌకను నింగిలోకి పంపబోతోంది. ఈ అంతరిక్ష యానం కోసం వర్జిన్ గెలాక్టిక్ వీఎస్ఎస్ యూనిటీ పేరుతో ప్రత్యేక వ్యోమనౌకను సిద్ధంచేసింది.

    ఇందులో అంతరిక్షం వెళ్లేందుకు ఇప్పటికే దాదాపు 600 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఐతే రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు మరో ఐదుగురు వ్యక్తులే అందులో ప్రయాణించనున్నారు. వీవీఎస్ యూనిటీ స్పేస్ ఫ్లైట్‌లో వర్జిన్ గెలాక్టిక్ రిచర్డ్ బ్రాన్సన్, చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్‌స్ట్రక్టర్ బెత్ మోసెస్, వర్జిన్ గెలాక్టిక్ లీడ్ ఆపరేషన్స్ ఇంజినీర్ కొలిన్ బెన్నెట్, శిరీష బండ్ల వెళ్తారు. ఈ వ్యోమనౌకకు డేవ్ మెకేయ్, మైఖేల్ మసూకి పైలెట్లుగా వ్యవహరిస్తారు. అంతరిక్షంలో ప్రయణించేందుకు గత వారంలో వర్జిన్ గెలాక్టిక్‌కు అమెరికాకు చెందిన ద ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు జారీచేసిన విషయం తెలిసిందే. వాతావరణం అనుకూలిస్తే రేపే ఈ ప్రయోగం జరుగుతుంది. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఉంటే కొన్ని రోజులు వాయిదా పడే అవకాశముంది.

    కల్పానా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న రెండో భారతీయులు శిరీష బండ్ల కావడం విశేషం. అంతేకాదు అంతరిక్షంలోకి వెళ్తున్న ఫోర్త్ ఇండియన్‌గా చరిత్ర సృష్టించనున్నారు.

    శిరీషా వయసు 34 ఏళ్లు. ఆమె తల్లిదండ్రులది గుంటూరు జిల్లా. ఈమె గుంటూరులోనే పుట్టారు. కానీ అమెరికాలో పెరిగారు. నాలుగేళ్ల వయసు నుంచి హ్యూస్టన్‌లో ఉంటున్నారు. పర్డ్యూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. జార్జ్‌టౌన్ యూనివర్సిటి నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా పొందారు. 2015లో వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా బండ్ల శిరీష చేరారు. అప్పటినుండి వర్జిన్ ఆర్బిట్ కోసం వాషింగ్టన్ కార్యకలాపాలను నిర్వహిస్తూ అనేక ఉన్నత ర్యాంకులను సొంతం చేసుకున్నారు. జూలై 11న బయలుదేరనున్న ‘వర్జిన్ గెలాక్టిక్’వ్యోమనౌకలో చోటు సంపాదించుకున్నారు. చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్‌స్ట్రక్టర్ బెత్ మోసెస్, లీడ్ ఆపరేషన్స్ ఇంజనీర్ కాలిన్ బెన్నెట్ అంతరిక్షంలోకి పయనించనున్నారు. అటు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కూడా ఈ నెల 20న అంతరిక్ష యాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు పోటీగా వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ 22 ప్రయోగం చేపడుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published: