ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్, ఎన్టీఆర్‌ను ఢీకొన్న రాజకీయ నేత కన్నుమూత...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు.

news18-telugu
Updated: February 16, 2020, 5:44 PM IST
ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్, ఎన్టీఆర్‌ను ఢీకొన్న రాజకీయ నేత కన్నుమూత...
అగరాల ఈశ్వర్ రెడ్డి (File)
  • Share this:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈశ్వర్ రెడ్డి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా తూకివాకం. 1933 డిసెంబర్ 28న చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం తూకివాకం గ్రామంలో ఈయ‌న జన్మించారు. 1957లో తూకివాక గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1962లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ఆయన.. రెండోసారి తిరుపతి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. గ్రామ సర్పంచిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన అగరాల, అనంతరం కాలంలో ఎమ్మెల్యేగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా, స్పీకర్ గా వ్యవహరించారు.

అగరాల ఈశ్వర్ రెడ్డి (File)


1981-82లో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. అనంతరం కొన్నాళ్లపాటు స్పీకర్‌గా పని చేశారు. 1983లో టీడీపీ ప్రభంజనంలో ఓటమిపాలయ్యారు. తిరుపతిలో ఎన్టీఆర్ పై పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఇటీవల సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. కర్నూలులో హైకోర్టు, విశాఖలో రాజధాని ఉండటం వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందని ఈశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు