Home /News /andhra-pradesh /

Konijeti Rosaiah: మాజీ సీఎం రోశయ్య ఇక లేరు.. అనారోగ్యంతో కన్నుమూత

Konijeti Rosaiah: మాజీ సీఎం రోశయ్య ఇక లేరు.. అనారోగ్యంతో కన్నుమూత

రోశయ్య (ఫైల్ ఫొటో)

రోశయ్య (ఫైల్ ఫొటో)

Konijela Rosaiah: 2009లో వైఎస్ మరణం తర్వాత.. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1968, 1974, 1980, 2009లో ఎమ్మెల్సీగా ఉన్నారు రోశయ్య. 1989, 2004 ఎన్నికల్లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) ఇకలేరు. 88 ఏళ్ల వయసున్న ఆయన అనారోగ్యంతో ఇవాళ  కన్నుమూశారు. ఉదయం అకస్మాత్తుగా రోశయ్యకు బీపీ తగ్గి, పల్స్ పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఆయన మరణించారని.. మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారని డాక్టర్లు చెప్పారు. రోశయ్య భౌతిక కాయాన్ని ఆస్పత్రి నుంచి అమీర్‌పేటలోని ఆయన ఇంటికి తరలించారు. రోశయ్య మరణం పట్ల కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీలు చెందిన నేతలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒక గొప్ప నేతను కోల్పోయామని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కొణిజేటి రోశయ్యకు అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ నేతలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. రోశయ్య అంత్యక్రియలు ఆదివారం మహాప్రస్థానంలో జరగనున్నాయి.

  Congress-TRS: కాంగ్రెస్ కు భారీ షాక్.. గులాబీ గూటికి కీలక నేత.. ఈ నెల 8న ముహూర్తం..

  రాజకీయాల్లో రోశయ్య సుదీర్ఘ కాలం ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా పనిచేశారు కొణిజేటి రోశయ్య. మంచి వక్తగా పేరుతెచ్చుకున్నారు. ఆయనకు ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉంది. 2009లో వైఎస్ మరణం తర్వాత.. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 3 సెప్టెంబరు 2009 నుంచి 24 నవంబరు 2010 వరకు సీఎంగా పనిచేశారు. 1968, 1974, 1980, 2009లో ఎమ్మెల్సీగా ఉన్నారు రోశయ్య. 1989, 2004 ఎన్నికల్లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1998లో నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచారు. 2011లో తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.

  Nara Lokesh: ఆ డబ్బులు మేమే కడతాం.. డ్వాక్రా మహిళలకు నారా లోకేష్ ఆఫర్..!

  కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు.

  1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇలా రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన రోశయ్య.. అనారోగ్యంతో మరణించడంతో కాంగ్రెస్ పార్టీలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Hyderabad, Rosaiah, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు