హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై కేంద్రం షాక్...

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై కేంద్రం షాక్...

వైఎస్ జగన్, కేసీఆర్ (File)

వైఎస్ జగన్, కేసీఆర్ (File)

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖ రాశారు.

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కృష్ణా, గోదావరి నదుల మీద కొత్త ప్రాజెక్టులు నిర్మించవద్దని ఆ లేఖలో స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి సంబంధించి చర్చించడానికి వీలైనంత త్వరగా భేటీ కావాలని లేఖలో కోరారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించిందని షెకావత్ విమర్శించారు. కృష్ణా, గోదావరి నదుల మీద ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగుతోంది. రెండు రాష్ట్రాలు తమ తమ ప్రాజెక్టులు సరైనవేనని చెబుతున్నాయి. అయితే, ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నాయంటూ ఫిర్యాదులు చేశాయి. ఈ క్రమంలో జలవనరుల శాఖ జోక్యం చేసుకుని రెండు రాష్ట్రాల కు మధ్య నీటి సమస్యను పరిష్కరించేందుకు ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులతో ఈనెల 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే, ఆ రోజు తమకు ముందుగా అనుకున్న ప్రకారం ముఖ్యమైన కార్యక్రమం (కేబినెట్ భేటీ) భేటీకి హాజరుకావడం కుదరదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి లేఖ రాశారు. వీలైనంత త్వరగా మరో భేటీని ఏర్పాటు చేయాలని కోరారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Godavari river, Krishna River Management Board, Telangana

    ఉత్తమ కథలు