హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ సీఎం YS Jagan ఎన్డీయేలో చేరాలి.. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు..

ఏపీ సీఎం YS Jagan ఎన్డీయేలో చేరాలి.. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు..

ఏపీ సీఎం YS Jagan ఎన్డీయేలో చేరాలి.. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే

ఏపీ సీఎం YS Jagan ఎన్డీయేలో చేరాలి.. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే

మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే (Ramdas Athawale) క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని ఆయన స్పష్టం చేశారు.

  మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే (Ramdas Athawale) క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఎన్డీయే కూటమిలో చేరాలని సూచించారు. విశాఖపట్నంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనకు మంచి మిత్రుడని అన్నారు. లోక్‌సభ, రాజ్యసభలో వైఎస్ జగన్ పార్టీ కేంద్రానికి సపోర్ట్‌గా నిలుస్తుందని అన్నారు. వైఎస్ జగన్ కేంద్రంలో భాగస్వామ్యం అయితే ఆంధ్రప్రదేశ్ మరింతగా అభివృద్ది చెందే అవకాశం ఉందన్నారు. కేంద్రం తప్పకుండా మరింతగా సాయం చేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి సాయం అందుతుందని.. వైఎస్ జగన్ ఎన్డీయే కూటమిలో చేరితే ఇరిగేషన్, జాతీయ రహదారులు, పర్యాటకం, ఇతర రంగాలు మరింతగా అభివృద్ది చెందుతాయని అన్నారు.

  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బలహీన వర్గాల కోసం అమలు చేస్తున్న పథకాలను కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే అభినందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో (YS Rajasekhar Reddy) తన అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

  Andhra Pradesh: ఈ నెల 18, 19 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేత.. కలెక్టర్ ఆదేశాలు.. ఎక్కడంటే..?


  కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) రోజురోజుకి పతనం అవుతోందని కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. కాంగ్రెస్ పార్టీ మరో 15 ఏళ్ల వరకు పుంజుకోనే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్ హయాంలో కూడా జరిగిందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందని.. అయితే ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు పార్లమెంట్ కమిటీ సిఫార్స్ చేశామన్నారు. ప్రైవేటీకరణ జరిగే ప్రభుత్వ సంస్థల్లో రిజర్వేషన్లకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

  ఎస్సీ, ఎస్టీ, బీసీలు (SC/ST/BC communities) తమ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కులాంతర వివాహాలు చేసుకునే అర్హులైన వ్యక్తులకు డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ రూ. 2.5 లక్షలు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కేంద్రం ముద్ర యోజన, ఉజ్వల యోజన, ఆవాస్ యోజన, జన్ ధన్ యోజనల వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన అన్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, Ysrcp

  ఉత్తమ కథలు