ఏపీ డీజీపీకి కేంద్రమంత్రి ఫోన్.. అమరావతి ఆందోళనలపై ఆరా

అమరావతిలో పరిస్థితులపై కేంద్రం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు.

news18-telugu
Updated: January 10, 2020, 10:55 PM IST
ఏపీ డీజీపీకి కేంద్రమంత్రి ఫోన్.. అమరావతి ఆందోళనలపై ఆరా
అమరావతిలో ఆందోళనలు
  • Share this:
అమరావతిలో రాజధాని రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకూ ఆందోళనలను ఉద్ధృతం చేస్తున్నారు స్థానికులు. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దని రోడ్డెక్కి నినదిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పోలీసుల మోహరింపు, జేఏసీ నేతల ర్యాలీలు, ఆందోళనకారుల అరెస్ట్‌లతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అమరావతిలో పరిస్థితులపై కేంద్రం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. అమరావతిలో రైతులు ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఏపీ మూడు రాజధానుల అంశం కేంద్రం దృష్టికి రాలేదని గురువారం కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఐనా రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: January 10, 2020, 10:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading