కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించామని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని అన్నారు. వందల మంది ప్రజలు ఈ ప్రమాదం కారణంగా ఇబ్బందిపడుతున్నారని అన్నారు. ఘటనపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీతో మాట్లాడానని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్రానికి అన్ని రకాలుగా సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.
Published by:
Kishore Akkaladevi
First published:
May 7, 2020, 10:15 AM IST