• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • UNION HOME MINISTER AMIT SHAH PHONE CALL TO AP CM YS JAGAN MOHAN REDDY TO DISCUSS ON CORONA VIRUS AND LOCKDOWN ISSUES AK

సీఎం జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్... వాటిపై చర్చ..

సీఎం జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్... వాటిపై చర్చ..

జగన్ విషయంలో కేంద్రం తప్పు చేస్తోందా... ఢిల్లీ ప్లాన్ ఏంటి?

ఎల్లుండితో లాక్‌డౌన్ 4.0 ముగుస్తుండటంతో... ఆ తరువాత కేంద్రం లాక్‌డౌన్‌పై ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తిగా మారింది.

  • Share this:
    కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు లాక్‌డౌన్ అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను అమిత్ షాకు సీఎం జగన్ వివరించారు. ఎల్లుండితో లాక్‌డౌన్ 4.0 ముగుస్తుండటంతో... ఆ తరువాత కేంద్రం లాక్‌డౌన్‌పై ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తిగా మారింది. అయితే మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచనలో కేంద్రం ఉందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్రాల నుంచి కేంద్రం సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది.

    ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ సడలింపులు ఏ విధంగా ఉండాలనే దానిపై గతంలోనూ కేంద్రానికి పలు సూచనలు చేసిన ఏపీ సీఎం జగన్... లాక్‌డౌన్ 5.0 సందర్భంగా ఇవ్వాల్సిన సడలింపులకు సంబంధించి కేంద్ర హోంమంత్రికి పలు సూచనలు చేసినట్టు సమాచారం. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ తొలగింపు చెల్లదని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం జగన్‌కు ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
    Published by:Kishore Akkaladevi
    First published: