హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ ప్రభుత్వానికి వరుస షాక్‌లు.. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో తాజాగా కేంద్రం ఝలక్

ఏపీ ప్రభుత్వానికి వరుస షాక్‌లు.. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో తాజాగా కేంద్రం ఝలక్

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల ప్రక్రియను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వాయిదా వేసింది. ఎత్తిపోతల పథకంపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరులశాఖతో పాటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల ప్రక్రియను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వాయిదా వేసింది. ఎత్తిపోతల పథకంపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరులశాఖతో పాటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల ప్రక్రియను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వాయిదా వేసింది. ఎత్తిపోతల పథకంపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరులశాఖతో పాటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...

  ఏపీ, తెలంగాణ మధ్య రోజు రోజుకు నీటి పంచాయతీ ముదురుతోంది. ఏకంగా మంత్రులే తిట్టుకుంటున్నారు. వైఎస్ జగన్ తెలంగాణ నీళ్లను దోచుకుంటున్నారని తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. వారికి అంతే స్థాయిలో ఏపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇరు ప్రభుత్వాల మధ్య యుద్దం జరుగుతున్న క్రమంలోనే.. ఏపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. నిన్న జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించగా.... ఇవాళ కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మరో ఝలక్ ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల ప్రక్రియను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వాయిదా వేసింది. ఎత్తిపోతల పథకంపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరులశాఖతో పాటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఆరు విషయాలపై వివరణ కోరింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ అభ్యంతరాలకు వివరణ ఇవ్వడంతో పాటు ప్రాజెక్టు డ్రాయింగ్స్‌, లే అవుట్లు, చార్టుల వివరాలను సమర్పించాలని తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఎంత నీటిని వాడుకుంటారు? భూసేకరణ ఎంత వరకు వచ్చింది? ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తారు? అనే వివరాలను ఇవ్వాలని స్పష్టం చేసింది.

  గతంలో తెలుగు గంగ ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులలో ఏపీ ప్రభుత్వం పలు సవరణలు కోరింది. ఐతే ప్రాజెక్టుల సవరణ విషయంలో స్పష్టత లేదని కేంద్ర పర్యావరణశాఖ తెలిపింది. ఏయే అంశాలకు అనుమతులు కావాలి? ఏయే అంశాలకు సవరణలు కావాలో.. సమగ్ర వివరాలను అందజేయాలని కోరింది. దీనికి సంబంధించి 24 పేజీలతో కూడిన లేఖను ఏపీ ప్రభుత్వానికి కేంద్ర అటవీ, పర్యావరణశాఖ పంపించింది. ప్రాజెక్టు విషయంలో పూర్తి స్పష్టత ఇచ్చిన తర్వాతే.. అనుమతుల ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది.

  శుక్రవారం జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) కూడా ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడిన విషయం తెలిసిందే. తమ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపాల్సి వస్తుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తీవ్రంగా హెచ్చరించింది. పర్యావరణ అనుమతులు లేకున్నా, ప్రాజెక్టు పనులను చేపట్టారని.. ఏపీకి వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఎన్టీజీలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. అనుమతులు లేకుండా పనులు చేపట్టవద్దని గతంలోనే ఎన్జీటీ హెచ్చరించిందని.. ఐనా పట్టించుకోకుండా నిర్మాణాలను చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన ఎన్టీజీ చెన్నై ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడింది. తమ ఆదేశాలను అమలు చేయకుంటే సీఎస్‌ను జైల్లో పెడతామని వార్నింగ్ ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాల్సిందిగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డుతో పాటు చెన్నైలోని కేంద్ర పర్యావరణ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది ఎన్జీటీ. తదుపరి విచారణను జులై 12కి వాయిదా వేసింది.

  మరోవైపు ఏపీ, తెలంగాణ గొడవల నేపథ్యంలో కేంద్రజలవనరుల శాఖ రంగంలోకి దిగింది. శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఫోన్‌లో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ వివాదం, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తీరును కేంద్ర జలవనరులశాఖ దృష్టికి తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకెళ్లారు. ఏపీ ఒకవేళ అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే తగిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌కు గజేంద్రసింగ్ షెకావత్ చెప్పినట్లు సమాచారం. ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు బృందాన్ని పంపిస్తామని.. అక్కడ పనులు జరుగుతున్న తీరును కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు.

  ఇవి కూడా చదవండి:

  AP Politics: ఆ వర్గం వైసీపీకి దూరమైందా..? వైసీపీ నేతలే దూరం చేసుకుంటున్నారా?

  పోలీసుల కన్ను కప్పేందుకు వేసిన ప్లాన్ రివర్స్. కోటి విలువచేసే గంజాయి సీజ్

  First published:

  Tags: Andhra Pradesh, Krishna River, Krishna River Management Board

  ఉత్తమ కథలు