నన్ను తీసేసి ఆయన్నెలా కొనసాగిస్తారు?... టీటీడీకి రమణ దీక్షితులు లేఖ...

తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ప్రధాన అర్చకులు ఏవీ రమణ దీక్షితులు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు లేఖ రాశారు.

news18-telugu
Updated: June 6, 2020, 3:38 PM IST
నన్ను తీసేసి ఆయన్నెలా కొనసాగిస్తారు?... టీటీడీకి రమణ దీక్షితులు లేఖ...
రమణ దీక్షితులు గౌరవ ప్రధాన అర్చకుల హోదాలో ఉండి ట్విటర్ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, బోర్డుకు సలహాలు ఇవ్వాలే కానీ మీడియాలో వ్యాఖ్యలు చేయడం రమణ దీక్షితులకు సబబు కాదన్నారు.
  • Share this:
తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ప్రధాన అర్చకులు ఏవీ రమణ దీక్షితులు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు లేఖ రాశారు. అనంతశయన దీక్షితులును వైఖానస ఆగమ సలహాదారుగా కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతశయన దీక్షితులు మే 30న రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన్ను వైఖానస ఆగమ సలహదారుగా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. తనకు ఓ నిబంధన, అనంతశయన దీక్షితులుకు మరో రూల్ ఎలా పాటిస్తారని ఆయన లేఖలో ప్రశ్నించారు. దీనిపై తనకు క్లారిటీ ఇవ్వాలని ఆయన లేఖలో కోరారు. తాను ప్రధాన అర్చకుడు, సీనియర్ వైఖానస ఆగమ సలహాదారుగా ఉండేవాడినని, అయితే, టీడీపీ ప్రభుత్వ హయాంలో తనకు 65 సంవత్సరాలు నిండిపోయాయి కాబట్టి కచ్చితంగా రిటైర్ అవ్వాలంటూ తనను తప్పించేశారని గుర్తు చేశారు.

2018 మే 16వ తేదీన టీటీడీ బోర్డు ఇచ్చిన తీర్మానం నెంబర్ 50 ద్వారా తాను తప్పకుండా పదవి నుంచి తప్పుకోవాలని చెప్పారని గుర్తు చేశారు. ‘రిటైర్ అయిపోయాననే కారణంతో సీనియర్ వైఖానస ఆగమ సలహాదారుగా ఉన్న పదవి నుంచి కూడా నన్ను దించేశారు. ఇప్పుడు అనంతశయన దీక్షితులు రిటైర్ అయ్యారు. ఆయన్ను ఎలా వైఖానస ఆగమ సలహాదారుగా కొనసాగిస్తారు?’ అని రమణ దీక్షితులు ప్రశ్నించారు. ఆయనేమైనా అంత గొప్ప మేధావా? అని నిలదీశారు. అనంతశయన దీక్షితులు సంభావన అర్చకుడిగా రిటైర్ అయ్యారని, అంటే, ఆయన ఓ అటెండర్ పొందినంద పెన్షన్ పొందేందుకు అర్హుడని వాదించారు. ప్రస్తుతం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అప్పుడు తన రిటైర్మెంట్ జరిగినప్పుడు కూడా ఉన్నారని, మరి ఇద్దరికీ ఎందుకు భేదభావం చూపుతున్నారని రమణ దీక్షితులు ప్రశ్నించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 6, 2020, 3:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading