హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big News: వైఎస్ వివేకా హత్య కేసులో ఊహించని పరిణామం..విచారణ బదిలీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Big News: వైఎస్ వివేకా హత్య కేసులో ఊహించని పరిణామం..విచారణ బదిలీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

వైఎస్ వివేకా హత్య కేసు

వైఎస్ వివేకా హత్య కేసు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు విచారణ బదిలీపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెల్లడించింది. వివేకా (YS Vivekananda Reddy) హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలనీ ఆయన కుమార్తె సునీత వేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు  (Supreme Court) విచారణ జరిపింది. ఈ క్రమంలో ఈ కేసును ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ (Telangana)కు బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది. హైదరాబాద్ CBI స్పెషల్ కోర్టుకు కేసును బదిలీ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం  (Supreme Court) తీర్పు ఇచ్చింది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Andhra Pradesh

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు విచారణ బదిలీపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెల్లడించింది. వివేకా (YS Vivekananda Reddy) హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలనీ ఆయన కుమార్తె సునీత వేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు  (Supreme Court) విచారణ జరిపింది. ఈ క్రమంలో ఈ కేసును ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ (Telangana)కు బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది. హైదరాబాద్ CBI స్పెషల్ కోర్టుకు కేసును బదిలీ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం  (Supreme Court) తీర్పు ఇచ్చింది.

AP Elections: ఆ నెలలోనే అసెంబ్లీ రద్దు.. ఎన్నికలు ఎప్పుడంటే..? నేతలకు సమాచారం అందిందా..?

ఏపీలో న్యాయం జరగదనే..

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీలో న్యాయం జరగదని ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కుమార్తె సునీత దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ వేసింది. ఇక దర్యాప్తు పురోగతిని కూడా నేరుగా పర్యవేక్షించాలని ఆమె పిటీషన్ లో పేర్కొంది. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు నేడు విచారణ జరిపింది, కేసుకు సంబంధించి విచారణపై వివేకా కూతురుకు, భార్యకు అసంతృప్తి ఉందన్న కారణంతో విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు తదుపరి విచారణను బదిలీ చేస్తున్నట్టు కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలు, ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్ కూడా సీబీఐకి పంపించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసును త్వరితగతిన, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా తదుపరి దర్యాప్తు కొనసాగాలని కోర్టు సూచించింది. ఈ కేసులో పెద్ద ఎత్తున నిందితులను విచారించాల్సి ఉంటుంది కాబట్టి హైదరాబాద్ CBIకి పూర్తి సహకారం అందించాలని ఆదేశాలు ఇచ్చింది. బాధితులకు న్యాయం జరుగుతుందని మాత్రమే కాదు న్యాయం జరగాలని కోర్టు చెప్పింది. న్యాయం జరగాలనుకోవడం బాధితురాలి యొక్క ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు కేసును తెలంగాణకు బదిలీ చేస్తున్నట్టు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ధర్మాసనం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.

3 ఏళ్లుగా దర్యాప్తు..

వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ 3 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి గంగిరెడ్డి, ఉమా శెంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారాడు. దీనితో కేసులో మరికొంత మంది ప్రమేయం ఉందొ లేదో తెలుసుకోడానికి దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Ap, AP News, Crime news, Telangana, Ys viveka murder case, YS Vivekananda reddy

ఉత్తమ కథలు