UNEVEN WEATHER IN ANDHRA PRADESH AS IMD PREDICTING CYCLONE FULL DETAILS HERE PRN VSP
AP Cyclone Alert: ఏపీకి పొంచిఉన్న వానగండం..? మార్చిలో తుఫాన్లు వస్తాయా..? నిపుణలేమంటున్నారంటే..!
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వాతావరణం (Weather) ఎప్పుడూ సాధారణంగానే ఉంటుంది. కానీ ప్రస్తుతం అనూహ్య మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి నెలలో వర్షాలు, వాయుగుండాలు సంభవించడం కష్టం. ఈ నెలలో అల్పపీడనాలు ఏర్పడినా తీవ్ర వాయుగుండం, తుపాను (Cyclone) గా మారడం చాలా అరుదు. ప్రస్తుతం తుపాను వస్తుందన్న ఆందోళన నెలకొంది.
వాతావరణం (Weather) ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు పెరగడం.. అంతేవేగంగా తగ్గింపోవడం. కాలం కాని కాలంలో వర్షాలు ముంచెత్తడం జరుగుతుంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అలాంటి పరస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి (March) నెలలో వర్షాలు, వాయుగుండాలు సంభవించడం కష్టం. ఈ నెలలో అల్పపీడనాలు ఏర్పడినా తీవ్ర వాయుగుండం, తుపానుగా మారడం చాలా అరుదు. అలాంటి అరుదైన వాతావరణం ఈనెలలో ఏర్పడబోతున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద వివరాలు తెలిపారు. గడిచిన 200 సంవత్సరాల కాలంలో కేవలం 11 సార్లు మాత్రమే ఈ తరహా వాతావరణం ఏర్పడిందని.. చివరిసారిగా 1994లో బంగాళాఖాతంలో స్వల్ప తుపాను వచ్చినట్లు వారు వెల్లడించారు. వాతావరణంలో మార్పులు, వాతావరణ పరిస్థితుల్లో తీవ్రమైన ప్రభావం కారణంగా ఇలా జరుగుతుందని అంటున్నారు.
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఉదయం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి శుక్రవారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది శ్రీలంకలోని ట్రింకోమలికి 360 కి.మీ., తమిళనాడులోని నాగపట్నంకు 700 కి..మీ., పుదుచ్చేరికి 760 కి.మీ., చెన్నైకు 840 కి..మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతం గంటకు 18 కి.మీ. వేగంతో కదులుతోందని.. రాగల 48 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణిస్తూ శ్రీలంక తూర్పు తీరం వెంబడి ఉత్తర తమిళనాడు వద్ద తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మార్చిలో తీవ్ర వాయుగుండం, తుపాను ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గడిచిన 200 సంవత్సరాల కాలంలో కేవలం 11 సార్లు మాత్రమే ఈ తరహా వాతావరణం ఏర్పడిందని.. చివరిసారిగా 1994లో బంగాళాఖాతంలో స్వల్ప తుపాను వచ్చినట్లు వారు వెల్లడించారు. ప్రస్తుత వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై తక్కువగా ఉంటుందన్నారు.
దీని ప్రభావంవల్ల దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు, రేపు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయనీ.. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 50–60 కి.మీ. గరిష్టంగా 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని.. ఈ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మత్స్యకారులెవ్వరూ 6వ తేదీ వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 580 కిలోమీటర్ల దూరాన వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. నేటి సాయంకాలానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నేడు, రేపూ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఓ మోస్తరునుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.