జగన్‌ కేసులపై ఉండవల్లి సంచలన కామెంట్స్...

ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ జగన్

Andhra Pradesh : వైసీపీ అంటే మొదటి నుంచీ పాజిటివ్‌గా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్... తాజాగా ఏపీ సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

 • Share this:
  Andhra Pradesh : వైసీపీ అధినేత జగన్‌పై కేసులు కోర్టుల్లో నిలవవు అని ఇదివరకు ఒకట్రెండు సార్లు కామెంట్ చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. అలాంటి ఆయన ఇప్పుడు మరోలా మాట్లాడటం కలకలం రేపుతోంది. ఏపీ సీఎం జగన్‌పై ఉన్న 11 కేసులు నిలుస్తాయా, నిలవవా అంటే... అది బీజేపీ చేతుల్లో ఉందన్నారు ఆయన. బీజేపీ పెద్దలు ఏం కోరుకుంటే అది జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు కోర్టులు, రాజ్యాంగాలతో పనిలేదన్నట్లు మాట్లాడిన ఉండవల్లి... జగన్‌పై సీబీఐ ఒత్తిడి పెరగడం వెనక బీజేపీ హస్తం ఉందన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల తాను సీఎం అయినందువల్ల ప్రతీ శుక్రవారం హైకోర్టుకు రావడం కుదరదని, మినహాయింపు ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. ఐతే... అలా మినహాయింపు ఇవ్వవద్దని సీబీఐ, ఈడీ కోర్టును కోరాయి. మినహాయింపు ఇస్తే... ఆయన తన పలుకుబడితో... సాక్షుల్ని ప్రభావితం చేస్తారని అన్నాయి. దీన్ని బట్టీ చూస్తే... టైమ్ చూసి జగన్‌కు షాక్ ఇస్తారని అంటున్నారు ఉండవల్లి అరుణ్‌కుమార్.

  అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఉండవల్లి అరుణ్ కుమార్. అలాంటి ఆయన... ఇప్పుడు చంద్రబాబును కలిశాక... తనకు చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత వైరమూ లేదని అంటున్నారు. పైగా చంద్రబాబుకి చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయని మెచ్చుకుంటున్నారు.

  స్వతహాగా లాయరైన ఉండవల్లి... తెలివిగా మాట్లాడటంలో దిట్ట. తన వాక్ చాతుర్యంతో ఇతరుల్ని ఆకట్టుకోవడంలో ఆయనకు ప్రత్యేక రికార్డ్ ఉంది. ఐతే... ఏం మాట్లాడినా... చట్టానికి చిక్కకుండా మాట్లాడుతూనే విషయాన్ని కుండబద్ధలుకొడతారు. అలాంటి ఉండవల్లి ఇప్పుడు మాత్రం... జగన్‌కు వ్యతిరేకంగా, చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతుండటం పొలిటికల్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది.

  నిజానికి వైసీపీ అధికారంలోకి వస్తే, ఉండవల్లికి కీలక పదవి ఇస్తారనే ప్రచారం అప్పట్లో సాగింది. ఐతే... రాష్ట్ర విభజన తర్వాత నుంచీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉండవల్లి... వైసీపీ విషయంలోనూ అదే రూల్ పాటించారు. ఊహాగానాలకు తెరదించారు. మరి చంద్రబాబుతో గంటపాటూ మాట్లాడిన తర్వాత... ఉండవల్లి మాటల్లో మార్పు ఎందుకొచ్చిందన్నది ఆసక్తి రేపుతోంది. అసలు చంద్రబాబు ఉండవల్లికి ఏం చెప్పారు... ఉండవల్లి చంద్రబాబు దగ్గర కొత్తగా ఏం తెలుసుకున్నారన్నది తేలాల్సిన అంశం. మొత్తంగా జగన్‌పై కేసులు పక్కకు పోతాయని వైసీపీ వర్గాలు భావిస్తున్న తరుణంలో... ఉండవల్లి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం ఆ పార్టీ వర్గాల్ని ఆలోచనలో పడేస్తోంది.

   

  Pics : కాలిఫోర్నియాలో కార్చిచ్చు... సర్వం నాశనం
  ఇవి కూడా చదవండి :

  బోరుబావిలో చిన్నారి మృతి... రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత

  Health Tips : రేగుపండ్లు తింటున్నారా... అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు


  Diabetes Tips : పసుపుతో డయాబెటిస్‌కి చెక్... ఎలా వాడాలంటే...

  Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి

  Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు

  Published by:Krishna Kumar N
  First published: