హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: ఉక్రెయిన్ విద్యార్థులపై జగన్ కీలక నిర్ణయం.. ఆ విషయంలో సాయం చేస్తామన్న సీఎం

YS Jagan: ఉక్రెయిన్ విద్యార్థులపై జగన్ కీలక నిర్ణయం.. ఆ విషయంలో సాయం చేస్తామన్న సీఎం

ఉక్రెయిన్ యుద్ధం (Ukraine War) లో చిక్కుకొని క్షేమంగా తిరిగొచ్చిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యార్థులు సీఎం జగన్ (CM YS Jagan) ను కలిశారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉక్రెయిన్ యుద్ధం (Ukraine War) లో చిక్కుకొని క్షేమంగా తిరిగొచ్చిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యార్థులు సీఎం జగన్ (CM YS Jagan) ను కలిశారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉక్రెయిన్ యుద్ధం (Ukraine War) లో చిక్కుకొని క్షేమంగా తిరిగొచ్చిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యార్థులు సీఎం జగన్ (CM YS Jagan) ను కలిశారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

  ఉక్రెయిన్ యుద్ధం (Ukraine War) లో చిక్కుకొని క్షేమంగా తిరిగొచ్చిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యార్థులు సీఎం జగన్ (CM YS Jagan) ను కలిశారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయానికి వచ్చిన విద్యార్థులు.. తమను సురక్షితంగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యఖ్యలు చేశారు. యుద్ధ పరిస్థితుల వల్ల ఉక్రెయిన్ ‌నుంచి వచ్చిన రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా.. వారికి వెంటనే సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను సరక్షితంగా వెనక్కి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగి సురక్షితంగా తీసుకొచ్చామన్నారు.

  మీరంతా రాష్ట్రానికి చెందిన పిల్లలని... ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ బాగోగులు చూసుకోవడం మా బాధ్యతన్నారు. ఆ బాధ్యతను అధికారులు సక్రమంగా నిర్వర్తించారని సీఎం జగన్ అన్నారు. విద్యార్ధులను సురక్షితంగా తీసుకురావడంలో సమర్ధవంతంగా వ్యవహరించిన అధికారులను సీఎం అభినందించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యకు తగిన పరిష్కారం లభించేలా మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖరాయాలని నిర్ణయించారు. అనంతరం విద్యార్థుల చదువులు గురించి ఆరా తీసిన సీఎం.. వారు కోర్సులను ఎంతవరకు పూర్తిచేశారో తెలుసుకున్నారు. అలాగే వారి చదువులు కొనసాగించేందుకు ప్రత్యామ్నాయాలపై చర్చించారు. ఈ విషయంలో ప్రభుత్వం పరంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

  ఇది చదవండి: వారిపై పరువు నష్టం దావా వేస్తా..! పెగాసస్ ప్రచారంపై ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు..

  తమను ఉక్రెయిన్‌నుంచి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేసిందన్న విద్యార్థులు.. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. దేశం మొత్తంమీద ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే అన్నిరకాలుగా చర్యలు తీసుకుందన్నారు. ఉక్రెయిన్‌ సమీప దేశాలకు చేరుకున్న దగ్గరనుంచి ఆహారం, వసతి విషయాల్లో బాగా చూసుకున్నారని విద్యార్థులు చెప్పారు. దీంతోపాటు దేశంలో అడుగుపెట్టిన దగ్గరనుంచి కూడా స్వస్థలాలకు చేరేంత వరకూ కూడా ఫ్లైట్‌ టిక్కెట్లు దగ్గరనుంచి ప్రయాణ, వసతి సదుపాయాలను ఏర్పాటు చేశారన్నారు. చేయాలనుకున్న పనిని చిత్తశుద్ధితో చేసిన తీరు తమకు స్ఫూర్తిదాయకమని విద్యార్థులు సీఎంతో అన్నారు.

  ఇది చదవండి: ఒకేసారి రెండు వ్యూహాలు.. ఆయన రాజకీయం అలాగే ఉంటుంది మరి..!

  కార్యక్రమంలో ఏపీ ఉక్రెయిన్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ప్రెసిడెంట్‌ మేడపాటి వెంకట్, సీఈఓ కె దినేష్‌ కుమార్, టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సభ్యులు అహ్మద్‌ బాబు, నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, యూకేలో ప్రత్యేక ప్రతినిధి రవి రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Russia-Ukraine War

  ఉత్తమ కథలు