ఉగ్ర శ్రీనివాసుడిగా దర్శనమిచ్చిన తిరుమల స్వామివారు

దీంతో సంవత్సరంలో క్షిరాబ్ది ద్వాదశి రోజు వేకువ జామున 4.30 గంటల సమయంలో ఆలయాన్ని వీడి తిరిగి 5.30 గంటలలోపు అలయంలోకి ప్రవేశిస్తారు స్వామివారు

news18-telugu
Updated: November 9, 2019, 8:51 AM IST
ఉగ్ర శ్రీనివాసుడిగా దర్శనమిచ్చిన తిరుమల స్వామివారు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • Share this:
కైశిక ద్వాదశి సందర్భంగా తిరుమల ఆలయ మాఢ వీధుల్లో  ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు వైభోవేతంగా జరిగింది. తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నారు.  ఈ మూర్తులు వరుసగా - భోగ శ్రీనివాసమూర్తి,  ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి,  శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములుగా వర్ణిస్తారు. వీటినే అర్చక పరి భాషలో...ధ్రువబేరం, కౌతుక బేరం, స్నపన బేరం, ఉత్సవ బేరం, బలి బేరంగా పిలుస్తారు. ఇలా ప్రధానాలయంలోని గర్భగుడిలో ఉన్న ఒక్కొక మూర్తికి ఒక్కో చరిత్ర కలిగి ఉంటుంది .అందులో భాగంగా ఇవాళ వెంకటత్తురైవార్,స్నపనబేరంగా పిలవబడే ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తికి సూర్యకిరణాలు తాకితే ఉగ్రత్వం వస్తుందట.

చాలా కాలం క్రితం శ్రీదేవి భూదేవి సమేత ఉగ్రశ్రీనివాస మూర్తిని ఊరేగించే సమయంలో స్వామివారిని సూర్యకిరణాలు తాకి తిరుమలలో భయంకర పరిణామాలు ఏర్పడి ఈ ఉత్సవం నిలిచి పోయింది. దీంతో సంవత్సరంలో క్షిరాబ్ది ద్వాదశి రోజు వేకువ జామున 4.30 గంటల సమయంలో ఆలయాన్ని వీడి తిరిగి 5.30 గంటలలోపు అలయంలోకి ప్రవేశిస్తారు స్వామివారు. వాహనం ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం ఆలయ అర్చకులు కైశిక ద్వాదశి ఆస్థాన పురాణాన్నీ వేడుకగా నిర్వహించారు. ఈ కారణంచేత అలయంలోని పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ.

First published: November 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...