హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Uddanam Coconut: తెల్లదోమ, నల్లముత్తు పురుగులతో‌ కొబ్బరి చిత్తు.. ఉద్దానం కొబ్బరి రైతు విలవిల..

Uddanam Coconut: తెల్లదోమ, నల్లముత్తు పురుగులతో‌ కొబ్బరి చిత్తు.. ఉద్దానం కొబ్బరి రైతు విలవిల..

File

File

కొబ్బరి పంటను నమ్ముకుని సుమారు రెండు లక్షల మంది ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

(ఆనంద్ మోహన్‌ పూడిపెద్ది, విశాఖ రిపోర్టర్ న్యూస్‌-18 తెలుగు)

పచ్చని కొబ్బరితోటలతో కనువిందు చేసే ప్రాంతం ఉద్దానం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం కొబ్బరితోటలకు దేశవ్యాప్తంగా ఫేమస్‌. ఒకప్పుడు సిరి సంపదలతో వర్ధిల్లిన ఈ ప్రాంత రైతుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. కొబ్బరిపంటకు సరైన ధర లేక.. ఎగుమతులు లేక రైతులు నిరాశ చెందుతున్నారు. తెగుళ్ల తాకిడితో ఉద్దానం కొబ్బరి రైతు విలవిలాడిపోతున్నారు. మరోవైవు దిగుబడి తగ్గడంతో రైతుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. తెగుళ్ల తాకిడి నుంచి రైతాంగాన్ని ఆదుకోవడానికి సేంద్రియ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి రైతులకు కీలక సూచనలు చేస్తున్నారు. రసాయనాలు కావు... బదనికల వల్లనే వీటిని నిర్మూలించచవ్చని అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, లావేరు, రణస్థలం, ఎచ్చర్ల మండలాల్లో కొబ్బరి తోటలు సాగవుతున్నాయి. జిల్లాలో సుమారు 25 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు సాగవుతున్నాయి. ఇళ్లపెరట, పొలాలు, కాలువ గట్లపైన వేలాది చెట్లు పెంచుతున్నారు. కొబ్బరి పంటను నమ్ముకుని సుమారు రెండు లక్షల మంది ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. నల్లముత్తు పురుగు, తెల్లదోమలతో తెగులు తమని వేధిస్తున్నాయని‌‌ రైతుల‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం అంబాజీపేటకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. కొబ్బరి పై పరిశోధనలు చేసే ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలపై అటు రైతులు దృష్టి సారిస్తున్నారు. బదనికలు వల్ల ఈ పురుగుపోటు పోతుందని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం తాలూకా ఓ ల్యాబ్ కూడా సోంపేటలోనే నెలకొల్పడం విశేషం.

ఇక అందులోని శాఖ ఉద్యోగి శ్రీలక్ష్మి నల్లముత్తు పురుగు, తెల్లదోమ నివారించడానికి చాలా పద్దతులు ఉన్నాయని, రసాయనాలు లేదా బదనికలు ఉపయోగించడం వల్ల వీటిని నివారించవ్చన్నారు. కాని రసాయనాల వల్ల 15 రోజులే పురుగు నుంచి చెట్టును కాపాడగలం కానీ బదనికలు ఉపయోగిస్తే అసలు మరలా రావు అన్నారు. సోంపేటలోనే బదనికలు ఉత్తత్తి జరుగుతోందన్నారు. గోనేజా రిఫైండటీస్ అనే బదనికలు నల్లముత్తు పురుగును నిరోదించవచ్చునన్నారు. తెల్లదోమ దీనికి కూడా ఇదే పద్దతిలోనే ఎపర్టోక్రైసాఏస్టా బదనికలు ఉన్నాయన్నారు. ఇవి ఆకుపై పెట్టి ఇస్తామని.. సాయంత్రం పూట ఆకుపై పెట్టి పిన్ చేయాలన్నారు. తీవ్రంగా ఉంటే 30 నుంచి 40 వరకూ బదనికలు పిన్ని చేయాలన్నారు.  ఈ జిల్లాలో కవిటి, కంచిలి, సోంపేట, రణస్థలం, లావేరులులలోఉన్న కొబ్బరి పంటపై తెగుళ్ల ప్రభావం ఉందన్నారు.

ఇక‌ ప్రోజక్టు అసిస్టెంట్ జిల్లాలో ఈ పురుగులను పారద్రోలాంటే బదనికలవల్లనే అవుతుందన్నారు. బదినికలలో మరొక రకమైన బ్రాకాహెబిటర్, గొనియాజిస్ నిఫాంజీస్ ఇవి రెండూ నల్లముత్తు పురుగును నివారిస్తుంది. ఈ పురుగు 21 రోజులలో పిల్ల పెట్టి నల్లముత్తును ఎదుర్కొని పూర్తిగా నివారిస్తుందననారు.  తోటలో వెయ్యి నుంచి 2 వేల వరకూ బదనికలు ఎకరా పొలంలో ఉన్న కొబ్బరి చెట్లకు వదలాలని... వీటి ధర కూడా అతితక్కువగా 700 రూపాయలు మాత్రమే ఛార్జి చేస్తున్నామన్నారు. కొన్ని తోటలు ఎండిపోయినట్లు ఉంటే సిఫార్సు చేసిన సేంద్రియ ఎరువులను వాడాలని...రసాయనిక ఎరువుల వల్ల భూమిలో సారం పోతుందన్నారు. పచ్చిరొట్ట లాంటివి వాడుకోవాలని సూచించారు.

First published:

Tags: Coconut, Farmers, Visakhapatnam

ఉత్తమ కథలు