తిరుమల వెంకన్నకు రూ. 14 కోట్ల విరాళం

స్నేహితులైన ఇద్దరు ఎన్నారైలు... రూ. 14 కోట్ల విరాళం అందించారు. ఈ మేరకు టీటీడీ స్పెషల్ ఆఫీసర్ అయిన ధర్మారెడ్డికి చెక్కును అందించారు.

news18-telugu
Updated: August 10, 2019, 8:02 AM IST
తిరుమల వెంకన్నకు రూ. 14 కోట్ల విరాళం
తిరుమల శ్రీవారి ఆలయం
  • Share this:
తిరుమల తిరుపతి దేవస్థానం... నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. దేశ విదేశాల నుంచి వేలాదిగా భక్తులు వెంకన్న దర్శనం కోసం వస్తూ ఉంటారు. తాజాగా యూఎస్‌కు చెందిన ఎన్నారైలు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఏడుకొండలవాడికి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కూడా జరుపుకొనే దివ్యమైన రోజు... కుటుంబసమేతంగా వారు స్వామివారి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల వెంకన్నకు భారీ విరాళం ప్రకటించారు.

స్నేహితులైన ఇద్దరు ఎన్నారైలు... రూ. 14 కోట్ల విరాళం అందించారు. ఈ మేరకు టీటీడీ స్పెషల్ ఆఫీసర్ అయిన ధర్మారెడ్డికి చెక్కును అందించారు. తాము ఇచ్చే ఈ మొత్తాన్ని టీటీడీకి సంబంధంచిన అన్నీ సేవా కార్యక్రమాల్లో వినియోగించాలని కోరారు. అయితే ఈ ఇద్దరు ఈ ఏడాదే కాదు.. గత ఏడాది కూడా స్వామివారికి భారీ విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గత ఏడాది జూలైలో ఎన్నారైలు ఇద్దరు కలిసి దాదాపు రూ. 13.5 కోట్లు స్వామివారికి విరాళం ఇచ్చినట్లుగా తెలిపారు.

First published: August 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు