నేనే రాజేశ్ శర్మ.. కాదు నేనే.. టీటీడీ బోర్డు సభ్యుడి పేరుతో తెరపైకి ఇద్దరు

రాజేశ్ శర్మ అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు టీటీడీ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఎవరి చేత ప్రమాణస్వీకారం చేయించాలో తెలియక టీటీడీ అధికారులు డోలాయమానంలో పడ్డారు.

news18-telugu
Updated: September 29, 2019, 4:59 PM IST
నేనే రాజేశ్ శర్మ.. కాదు నేనే.. టీటీడీ బోర్డు సభ్యుడి పేరుతో తెరపైకి ఇద్దరు
తిరుమల బ్రహ్మోత్సవాలు
  • Share this:
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో రాజేశ్ శర్మ అనే మహారాష్ట్ర వ్యక్తిని సభ్యుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నోట్ ఇప్పుడో కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. రాజేశ్ శర్మ అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు టీటీడీ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఎవరి చేత ప్రమాణస్వీకారం చేయించాలో తెలియక టీటీడీ అధికారులు డోలాయమానంలో పడ్డారు. టీటీడీ ధర్మకర్తల మండలిలో రాజేశ్‌ శర్మ పేరుతో ఏర్పడిన గందరగోళంపై బిజేపి నేతలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 36 మందితో ఏర్పాటైన బోర్డులో ఇప్పటికే 24 మంది సభ్యులు, ఆరుగురు ప్రత్యేక ఆహ్వానితులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా సభ్యుల్లో డీపీ అనంత, సుధా నారాయణమూర్తి, రాజేశ్‌శర్మ, రమేశ్‌ శెట్టి, ప్రత్యేక ఆహ్వానితుల్లో గోవిందహరి (హైదరాబాద్‌) ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే రాజేశ్‌ శర్మ పేరుతో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు టీటీడీ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో నియమితులైన అసలు సభ్యుడెవరో.. ఎవరి చేత ప్రమాణం చేయించాలో అర్థంగాక టీటీడీ గందరగోళంలో పడింది. దీంతో ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరాలు వచ్చాక చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు టిటిడి అధికారులు. దీనిపై ఏ.పి బిజేపి రాష్ర్డ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డిలు తీవ్ర విమర్శలు చేశారు. జంబో బోర్డులో నియమించిన సభ్యుల ఊరు పేరు తెలికుండానే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తారని ప్రశ్నించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 29, 2019, 4:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading