ఏపీ ఎమ్మెల్యేకే ‘కుర్రోకుర్రు’... కటాకటాల పాలైన ఇద్దరు

నరదిష్ట పూజలు చేయాలని ఏకంగా ఓ ఎమ్మెల్యేకే భారీ మొత్తానికి టోకరా వేయడానికి ప్రయత్నించారు ఇద్దరు వ్యక్తులు. ఏపీలోని చీరాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.

news18-telugu
Updated: April 30, 2019, 3:12 PM IST
ఏపీ ఎమ్మెల్యేకే ‘కుర్రోకుర్రు’... కటాకటాల పాలైన ఇద్దరు
ఆమంచి కృష్ణమోహన్ (File)
  • Share this:
పూజలు, మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేయడానికి కొందరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. తమ మాట వింటే... సామాన్యులతో పాటు పెద్ద పెద్ద వాళ్లను కూడా మోసం చేయడానికి వీరు ఏ మాత్రం వెనుకాడరు. అలా పూజల పేరుతో ఏకంగా ఓ ఎమ్మెల్యేకే టోకరా వేయబోయిన ఇద్దరు వ్యక్తులు... తమ టైమ్ బాగులేకపోవడంతో కటాకటాలపాలైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు టోకరా వేద్దామనుకున్నారు ఇద్దరు వ్యక్తులు. కోయదొరల వేషంలో ఆమంచి కృష్ణమోహన్‌ను సంప్రదించి ప్రత్యేక పూజలు చేయాలని చెప్పారు.

చిన్న చిన్న పూజలైతే చేయించుకుందామని ఆయన కూడా భావించారు. అయితే మీకు నరదిష్టి తగిలిందని పెద్ద పూజ చేయాలని ఆ ఇద్దరు నమ్మబలికారు. ఇందుకోసం ఏకంగా రూ. 12 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. వీరి వేషధారణ...వీరు డిమాండ్ చేసిన మొత్తం కారణంగా అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు ఎమ్మెల్యే ఆమంచి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు...ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి వారిని కుమారబాబు, సహదేవుడుగా గుర్తించారు. ఎమ్మెల్యే కాకుండా ఇంకెంతమందితో ఇలాంటి పూజల పేరుతో మోసాలకు పాల్పడ్డారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.First published: April 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు