TWO MONTHS PREGNANT WOMAN COMMITS SUICIDE AFTER UNBEARABLE TORTURE FOR DOWRY HARASSMENT BY HUSBAND FAMILY IN ANANTHAPURAM HSN
భార్య రెండు నెలల గర్భిణి.. పెళ్లయిన 14 నెలలకే అద్దె ఇంట్లో వేరు కాపురం.. రాత్రి డ్యూటీ నుంచి భర్త ఇంటికొచ్చేసరికే ఘోరం..
రిజ్వానా పెళ్లినాటి ఫొటో
అనంతపురం జిల్లాలోని యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన బాబా ఫకృద్దీన్ కు కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామానికి చెందిన రిజ్వానాతో 14 నెలల క్రితం పెళ్లయింది. పెళ్లి సమయంలో భారీగానే కట్నకానుకలను సమర్పించారు.
14 నెలల క్రితం ఆ యువతికి పెళ్లయింది. ప్రస్తుతం రెండు నెలల గర్భిణి కూడా. పిల్లా పాపలతో హాయిగా గడపాల్సిన భవిష్యత్ ఇంకెంతో ఉంది. కానీ అప్పుడే ఆమెకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. భర్త డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే సమయానికే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికొచ్చిన భర్త, జరిగిన ఘోరాన్ని చూసి లబోదిబోమన్నాడు. దీంతో విషయం స్థానికులకు తెలిసి అంతా కన్నీటిపర్యంతమయ్యారు. అయితే భర్త, అతడి కుటుంబ సభ్యుల వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం వేధింపులు భరించలేక ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని గుండెలు పగిలేలా ఏడ్చారు. గర్భవతి అయిన తమ కూతురు మరికొద్ది నెలల్లో తల్లిగా మారబోతోందని ఆశపడ్డ వారికి, శవమై కనిపించడంతో తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు.
అనంతపురం జిల్లాలోని యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన బాబా ఫకృద్దీన్ కు కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామానికి చెందిన రిజ్వానాతో 14 నెలల క్రితం పెళ్లయింది. పెళ్లి సమయంలో భారీగానే కట్నకానుకలను సమర్పించారు. 15 తులాల బంగారంతోపాటు లక్షన్నర రూపాయల నగదును కట్నంగా ఇచ్చారు. అయితే పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం బాబా ఫకృద్దీన్ వేధించేవాడు. భర్తకు తోడుగా అత్తమామలు, ఆడపడుచే కాకుండా, మరిది కూడా అదనపు కట్నం తీసుకురావాల్సిందిగా నానా మాటలు అనేవారు. వీరి మాటల గురించి తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు వచ్చి పంచాయతీ చేశారు. చివరకు మూడు నెలల క్రితం నుంచి అనంతపురం నగర శివారులోని ఎర్నాటకొట్టాలలో ఓ అద్దె ఇంట్లో వేరు కాపురం పెట్టారు.
ప్రస్తుతం రిజ్వానా రెండు నెలల గర్భిణి. బాబా ఫకృద్దీన్ తన తండ్రి వద్దే వెల్డింగ్ పనిచేస్తుండేవాడు. రోజూ లాగానే శుక్రవారం కూడా పనికి వెళ్లి రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఎన్నిసార్లు పిలిచినా రిజ్వానా పలకకపోవడంతో తలుపులు పగలగొట్టి చూశాడు. ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆమె కనిపించింది. దీంతో గట్టిగా కేకలు వేశాడు. విషయం స్థానికులకు తెలియడం, ఆ తర్వాత పోలీసులు ఎంట్రీ ఇవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. కాగా, ఘటన గురించి తెలిసిన రిజ్వానా తల్లిదండ్రులు అల్లుడు, అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. అదనపు కట్నం వేధింపుల వల్లే తమ కుమార్తె ఇంతటి దారుణానికి పాల్పడి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.