రెండు లారీలు ఢీ... చెలరేగిన మంటలు... ఇద్దరు దుర్మరణం...

రోడ్డు ప్రమాదాల నివారణకు... ఎన్నో చర్యలు తీసుకుంటున్నామనీ... సెప్టెంబర్ 1 నుంచీ కొత్త రూల్స్ కూడా తెస్తున్నా్మని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రమాదాలు మాత్రం ఆగట్లేదు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 22, 2019, 10:15 AM IST
రెండు లారీలు ఢీ... చెలరేగిన మంటలు... ఇద్దరు దుర్మరణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్... విజయనగరం జిల్లా గజపతినగరం దగ్గర్లో జరిగిన రోడ్డు ప్రమాదం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓ ఆగివున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీ కొట్టింది. ఉన్నట్టుండి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఢీకొట్టిన లారీలో డ్రైవర్‌, క్లీనర్‌ తప్పించుకోలేకపోవడంతో.. సజీవదహనం అయ్యారు. ఈ దుర్ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే... ఓ ప్రమాదం జరగడం వల్లే... అక్కడ ఆ లారీ ఆగివుంది. అదే లారీని ఇప్పుడు మరో లారీ ఢీకొట్టినట్లైంది. ఇదంతా... 26వ నెంబర్ హైవేపై జరిగింది. విశాఖ నుంచి పార్వతీపురం వైపు కెమికల్ పౌడర్ లోడ్‌తో వెళ్తున్న లారీ... ఆగి వున్న లారీని వెనక నుంచీ వెళ్లి ఢీకొట్టింది. వెంటనే కెమికల్ లారీలో మంటలు చెలరేగాయి.

చనిపోయిన వాళ్లను మధ్యప్రదేశ్‌కు చెందిన డ్రైవర్‌ రామచందర్‌యాదవ్‌ (40), క్లీనర్‌ ప్రకాష్‌ సింగ్‌ (30)గా గుర్తించారు. ఈ దుర్ఘటన హైవేపై జరగడంతో... ఇతర వాహనాలకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉదయం 3 నుంచీ 6 గంటల వరకూ వాహనాలు నిలిచిపోయాయి. అప్పటికే విషయం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి వెళ్లి... ట్రాఫిక్‌ను సరిచేశారు. రెండు లారీల పైనా కేసు నమోదు చేశారు.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు