విశాఖ ఏజెన్సీలో ల్యాండ్ మైన్ పేలడం కలకలం రేపుతోంది. ఏజెన్సీ ప్రాంతంలోని పెదబయలు మండలం కోండ్రూము అటవీ ప్రాంతంలో ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. అసలు ఈ ల్యాండ్ మైన్ ఎవరి కోసం ఏర్పాటు చేశారు ? మావోయిస్టుల లక్ష్యం ఎవరు ? అనే దానిపై విచారణ కొనసాగుతోంది. పోలీసులను టార్గెట్ చేస్తూ మందుపాతర పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని పెదబయలు మండలం చింతలవీధికి చెందిన మోహన్ రావు, అజయ్ కుమార్ గుర్తించారు. ఇటీవల తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పెరిగిపోవడంతో... పోలీసులు వాటిపై నిఘా పెట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు పోలీసులను టార్గెట్ చేస్తూ ల్యాండ్ మైన్ ఏర్పాటు చేశారనే అనుమానాలు కలుగుతున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.