Chittoor News : చిత్తూరు జిల్లాలోని కురబలకోట మండలం... బీసీ కాలనీలో జరిగిందీ దుర్ఘటన. ఇక్కడ నివసిస్తున్న షేక్ ఇస్మాయిల్‌కి ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలున్నారు. పదేళ్ల సయ్యద్, ఆరేళ్ల మౌలాలీ... ఇద్దరూ సెల్‌ఫోన్‌లో రకరకాల గేమ్స్ ఆడుకుంటున్నారు. నాకు కావాలంటే, నాకు కావాలి అంటూ ఇద్దరూ ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఒకే సెల్‌ఫోన్‌లో ఇద్దరూ ఆడుకుంటున్నారు. ఐతే, గ్యాప్ లేకుండా గేమ్స్ ఆడుతుండటంతో... స్మార్ట్‌ఫోన్ హీటెక్కింది. అసలే ఎండాకాలం కావడంతో... ఆ హీట్ త్వరగా పెరిగింది. ఆ విషయం చిన్న పిల్లలకు ఏం తెలుస్తుంది. వాళ్ల ఆటలు వాళ్లవి. ఇద్దరూ ఆటలో మునిగిపోయారు. ఆట మంచి థ్రిల్ ఇస్తోంది. స్కోర్ బాగా పెరుగుతోంది. సరిగ్గా అప్పుడే ఏదో పేలినట్లు భారీ శబ్దం వచ్చింది.
ఏంటా సౌండ్ అని ఇంట్లోని పెద్దవాళ్లు హాల్‌లో ఆడుకుంటున్న పిల్లలవైపు చూశారు. పిల్లల ముఖాలపై భారీ గాయాలు. చేతుల నిండా రక్తం, డ్రెస్సుల నిండా రక్తపు మరకలు... ఆ చిన్నారులను ఆ స్థితిలో చూసిన తల్లిదడ్రులకు చేతులూ, కాళ్లూ ఆడలేదు. ఏడుస్తున్న పిల్లల్ని అంబులెన్స్‌లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రైమరీ ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్లు... పరిస్థితి కంట్రోల్ తప్పుతోందన్నారు. పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. దాంతో అక్కడి నుంచీ పరుగు పరుగున ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
మనందరం మన ఇళ్లలో పిల్లలకు స్మా్ర్ట్ ఫోన్లు ఇస్తున్నాం. మనం మాటల్లోనో, పనిలోనో ఉంటే... వాళ్లు ఆటల్లో మునిగితేలుతున్నారు. ఆ గేమ్స్ కూడా మళ్లీ మళ్లీ ఆడేలా చేయిస్తున్నాయే తప్ప బోర్ కొట్టవు. బట్... ఆ స్మార్ట్‌ఫోన్లు పేలిపోవని ఏంటి గ్యారెంటీ. ఎక్కువ సేపు హీట్ అయితే ప్రమాదమే. పిల్లలకు ఇలాంటివి తెలియవు కాబట్టి... పెద్దవాళ్లుగా మనమే వాళ్లను కంట్రోల్‌లో పెట్టాలి. మొబైల్‌తో అతిగా ఆడనివ్వకుండా భయం భక్తీ నేర్పాలి. అది వాళ్ల మేలు కోసమే కదా.
ఇవి కూడా చదవండి :
కేబినెట్ కూర్పుపై జగన్ దృష్టి... తూర్పు గోదావరి జిల్లా నేతకు అత్యంత కీలక మంత్రి పదవి ?
ఏపీలో రాజకీయ సంక్షోభం... టార్గెట్ చంద్రబాబు ? రాష్ట్రపతి పాలన తెస్తారా ?
మరింత పెరగబోతున్న ఎండల వేడి... ఫొణి తుఫాను ప్రభావమే...
కరెంటు షాక్ కొట్టిన కూలర్... ఆరేళ్ల చిన్నారి మృతి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, BLAST, Chittoor S01p25, Mobiles