హోమ్ /వార్తలు /andhra-pradesh /

YS Viveka Murder Case: వివేకా కేసులో మరో ట్విస్ట్... అందుకే హత్య..?

YS Viveka Murder Case: వివేకా కేసులో మరో ట్విస్ట్... అందుకే హత్య..?

వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case) లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దెవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల (Pulivendula) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో పలు సంచలన విషయాలను ఆమె పేర్కొన్నారు.

వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case) లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దెవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల (Pulivendula) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో పలు సంచలన విషయాలను ఆమె పేర్కొన్నారు.

వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case) లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దెవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల (Pulivendula) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో పలు సంచలన విషయాలను ఆమె పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...

    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy Murder Case) రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో అప్రూవర్ గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం, ఆ తర్వాత అతడు ఇచ్చిన ఫిర్యాదు ఇతర అంశాలు బయటకురావడంతో ఏ క్షణానైనా కీలక వ్యక్తులను సీబీఐ అదుపులోకి తీసుకోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హత్య కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దెవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ  కడప జిల్లా (Kadapa District) పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో పలు సంచలన విషయాలను ఆమె పేర్కొన్నారు. వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. వివేకా రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబంలో కొన్నేళ్లుగా అంతర్గత విభేదాలున్నాయన్నారు.

    వివేకా హత్య తరువాత ఆయన కుటుంబ సభ్యుల తీరు అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. వైఎస్ వివకానందరెడ్డి హత్య కేసులో ఆయన అల్లుడు/ చిన బావమరిది రాజ శేఖర్ రెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డిలతో పాటు కొమ్మా పరమేశ్వర రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, వైజీ రాజేశ్వర రెడ్డి, నీరుగట్టు ప్రాసాద్ ల పాత్ర ఉందని.., వారినీ సీబీఐ విచారించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

    ఇది చదవండి: జగన్ పాలనను కామెడీ సినిమాతో పోల్చిన బీజేపీ.., సంక్షేమ పథకాలపై సెటైర్లు..

    వికేకా కుటుంబంలో తీవ్ర విబేధాలు ఉన్నాయని తులసమ్మ పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన షేక్ షమీమ్ అనే మహిళ ను వివాహం చేసుకున్నారని.., ఆమెతో ఒక బాబుని కూడా కన్నారని.., వారికి రెండు కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వాలని వివేకా భావించారని అందులో ఉంది. ఈ విషయంపై ఆ కుటుంబంలో తీవ్ర విబేధాలు నెలకొన్నాయని., కొన్నేళ్లుగా వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె, అల్లుడు వద్ద హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన ఒక్కరే పులివెందులలో ఉంటున్నారని తులసమ్మ పేర్కొన్నారు. ఈ కోణంలో సిట్ కేసు దర్యాప్తు చేస్తుండటంతోనే దానిని అడ్డుకునేందుకే వివేకా భార్య సౌభాగ్యమ్మ ఆ కేసును సీబీఐ కి అప్పగించాలని కోర్టు లో కేసు వేశారని తులసమ్మ ఆరోపించారు.

    దేవిరెడ్డి తులమ్మ పిటిషన్లోని అంశాలు

    ఇది చదవండి: కొడాలి నానిపై చంద్రబాబు కొత్త వ్యూహం..? ఆ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

    వివేకానంద రెడ్డి హత్య చనిపోయిన విషయాన్ని ఆయన పీఏ కృష్ణారెడ్డి వివేకా నంద రెడ్డి కుటుంబ సభ్యులకే ముందు చెప్పారని., అక్కడి ఫొటోలు తీసి వారికి వాట్సప్ చేశారని., అవి చూసిన తరువాత కూడా వివేకానంద రెడ్డి పెద్ద బావమరిది అది గుండె పోటు అని టీడీపీ నేత, అప్పటి రాష్ట్ర మంత్రి ఆది నారాయణ రెడ్డికి చెప్పారని., ఆయన ఎందుకు అలా చెప్పారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

    ఇది చదవండి: జనసేన టార్గెట్ ఈ స్థానాలేనా.. కష్టపడితే గెలుపు గ్యారెంటీ అంటున్న సైనికులు.. పవన్ వ్యూహమేంటి..?

    ఇక వివేకా రాసినట్టు చెబుతున్న లేఖ, ఆయన సెల్ ఫోన్ లను పోలీసులకు తాము వచ్చిన వరకూ ఇవ్వొద్దని శివ ప్రకాశ్ రెడ్డి ఆయన పీఏ కృష్ణారెడ్డికి చెప్పారని., ఆ రోజు సాయంత్రం తరువాతే పోలీసులకు ఇచ్చారని., అలా ఎందుకు చేశారు..? ఆ సెల్ ఫోన్ లో డాటా ఎందుకు డిలీట్ చేశారో తేల్చాలని పిటిషన్లో పేర్కొన్నారు. వివేకా అల్లుడు, పెద్ద బావమరిది రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఆశిస్తున్నారు. అది సాధ్యం కాకపోవడంతో పాటు రూ.2 కోట్ల ఆస్తి కూడా పోతుండటంతో వివేకా నంద రెడ్డి మీద కక్ష పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని., తులసమ్మ తన పిటిషన్లో కోరారు. ఈ కేసుతో సంబంధం లేనివారిని సీబీఐ ఉద్దేశ్య పూర్వకంగానే వేధిస్తోందని ఆరోపించిన తులసమ్మ.., సిట్ దర్యాప్తు నివేదికలను బయట పెట్టాలని ఆమె కోరారు.

    First published:

    ఉత్తమ కథలు