Home /News /andhra-pradesh /

TWIST IN SI DEATH CASE IN KAKINADA DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

AP News: సూసైడ్ కాదు మిస్ ఫైర్.. ఎస్సై మృతి కేసులో ఊహించని ట్విస్ట్.. కుటుంబ సభ్యుల అనుమానం

గోపాలకృష్ణ (ఫైల్)

గోపాలకృష్ణ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంచలనం సృష్టించిన కాకినాడ జిల్లా (Kakinada District) సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ మృతి కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంచలనం సృష్టించిన కాకినాడ జిల్లా (Kakinada District) సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ మృతి కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గోపాలకృష్ణ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతుంటే.. కుటుంబ సభ్యులు మాత్రం మిస్ ఫైర్ అంటున్నారు. మీడియాతో మాట్లాడిన గోపాల కృష్ణ తండ్రి, సోదరుడు ఆత్మహత్య చేసుకునేంత ఇబ్బందులు గోపాలకృష్ణకు లేవని స్పష్టం చేస్తున్నారు. ఆర్ధిక సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా లేవని అంటున్నారు. ఉద్యోగం అంటే ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్నవార్తల్లో నిజం లేదని గోపాలకృష్ణ సోదరుడు చెబుతున్నారు. ఎస్సై అవ్వాలన్న లక్ష్యంతోనే కష్టపడి ఉద్యోగం సాధించాడని.. అలాంటప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు.

    ఎన్టీఆర్ విజయవాడ జిల్లా (NTR District) పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన ముత్తవరపు శ్రీనివాసరావు కుమారుడు గోపాలకృష్ణ.. తొలుత వీఆర్వోగా పనిచేసిన గోపాలకృష్ణ.. ఆ తర్వాత ఎస్సై ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ సర్పవరం ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. భార్య పావని, ఇద్దరు పిల్లలతో కలిసి కాకినాడలో నివాసముంటున్నారు. శుక్రవారం ముమ్మిడివరంలో సీఎం జగన్ పర్యటన ఉండటంతో ముందురోజు బందోబస్తు విధులకు హాజపరయ్యారు. ఆ తర్వాత ఇంటికొచ్చి.. శుక్రవారం ఉదయం ఇంట్లో సర్వీస్ రివాల్వర్ తో సూసైడ్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

    ఇది చదవండి: వీడిన అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీ.. గోడదూకి ఎక్కడికెళ్లారంటే..!


    కుటుంబ సభ్యులిచ్చిన సమాచారంతో పోలీసులు గోపాలకృష్ణ ఇంటివద్దకు చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను మినహా ఎవర్నీ ఆస్పత్రిలోకి అనుమతించలేదు. పోలీసులు సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నా.. కుటుంబ సభ్యులు మాత్రం మిస్ ఫైర్ అంటున్నారు. దీనిపై పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

    ఇది చదవండి: పెన్షన్ కోసం ఎంత నాటకమాడింది..? భర్తకే డెత్ సర్టిఫికెట్ ఇచ్చింది మహాతల్లి..!


    ఇదిలా ఉంటే గోపాలకృష్ణ ఎవరితోనూ కఠినంగా ఉండరని.. సౌమ్యంగానే వ్యవహరిస్తారని తెలిసింది. పోలీస్ ఉద్యోగం తనకు సరిపడదని ఏదైనా వ్యాపారం చేసుకుంటానని భార్యతో, కుటుంబ సభ్యులతో అన్నట్లు వార్తలు వచ్చాయి. ఉద్యోగాన్ని వదిలేయలనే ఉద్దేశంతో మరింత ఉన్నత ఉద్యోగం సాధిచండానికి పరీక్షలకు కూడా ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. ఉద్యోగంలో ఒత్తిడులు ఎక్కువై ఇలా జరిగిందా..? లేక కుటుంబ సభ్యులు అన్నట్లుగా నిజంగానే తుపాకీ మిస్ ఫైర్ అయిందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇప్పటికే మృతదేహాన్ని పరిశీలించిన డీఐజీ పాలరాజు, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి స్పష్టతనిచ్చే అవకాశముంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Police, Kakinada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు