Tungabhadra Pushkaralu: తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి.. నది స్నానాలకు అనుమతి లేదన్న మంత్రి వెల్లంపల్లి

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(ఫైల్ పొటో)

తుంగభద్ర పుష్కరాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Share this:
    తుంగభద్ర పుష్కరాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటి నుంచి డిసెంబర్ 1వరకు తుంగభద్ర పుష్కరాలు కొనసాగుతాయని అన్నారు. పుష్కరాలకు సబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తులను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఘాట్‌లలోకి అనుమతిస్తామని తెలిపారు. పుష్కరాల్లో భాగంగా రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు వెళ్లనున్నట్టు చెప్పారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం నది స్నానాలను నిషేధించినట్టు తెలిపారు.

    దేశంలోని ఏ రాష్ట్రంలోనూ నది స్నానాలకు అనుమతి లేదని చెప్పారు. పుష్కరాలను కూడా విపక్షాలు రాజకీయ కోణంలో చూస్తున్నాయని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు.. పుష్కరాల పేరిట వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇక, శుక్రవారం మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ కర్నూలు చేరుకోని తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించనున్నారు. కర్నూలులోని సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్‌లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

    మరోవైపు తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 23 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా ఈసారి నదీ స్నానాలకు బదులుగా భక్తులు జల్లు సాన్నాలు చేయాలని సూచించారు. ఈ మేరకు ఘాట్ల వద్ద స్ప్రింకర్లను ఏర్పాటు చేస్తోంది.
    Published by:Sumanth Kanukula
    First published: