Tungabadhra Pushkaralu: నవంబర్ లో తుంగభద్ర పుష్కరాలు.. విశిష్టత ఇదే..

Tungabadhra Pushkaralu: పన్నెండేళ్లకోసారి వచ్చే తుంగభద్ర పుష్కరాలు నవంబర్ లో మొదలుకానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో 2020 నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 దాకా జరిగే ఈ పుష్కరాల విశిష్టత తెలుసుకుందామా..

news18
Updated: September 30, 2020, 1:04 PM IST
Tungabadhra Pushkaralu: నవంబర్ లో తుంగభద్ర పుష్కరాలు.. విశిష్టత ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: September 30, 2020, 1:04 PM IST
  • Share this:
పన్నెండేళ్లకోసారి వచ్చేది పుష్కరం. పవిత్ర తుంగభద్ర నదికి పుష్కరాలు శార్వరీ నామ సంవత్సరంలో.. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 దాకా ఇవి జరగనున్నాయి. ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించేటపుడు ప్రతి నదికి పుష్కరాలు జరుపుతారు. దేశంలో పుష్కరాలు జరిపే 12 నదులలో తుంగభద్ర ఒకటి. నవగ్రహాల్లో ఒకటైన గురు గ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో పరిభ్రమిస్తుంటుంది. బృహస్పతి మకరరాశిలో ప్రవేశించే సమయంలో తుంగభద్ర నదికి పుష్కరాలు జరుపుతారు. చివరిసారిగా 2008లో ఈ నదికి పుష్కరాలు జరిగాయి. ఈ పుష్కరాలు జరిగే 12 రోజుల్లో ముక్కోటి దేవతలు ఆ నదులలో కొలువై ఉంటారని ప్రతీతి. ఈ సమయంలో ఆ నదిలో స్నానమాచరించిన వారి పాపాలు తొలిగి.. పుణ్యం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పశ్చిమ కనుమల నుంచి మొదలై..

కర్నాటక ఎగువ భాగాన ఉన్న పశ్చిమ కనుమలలో ఉద్భవించినవే తుంగ, భద్ర. ఇది కర్నాటకలో కృష్ణా పరివాహక ప్రాంతం మీదుగా ప్రవహిస్తూ.. కర్నూలు జిల్లాలో గల కౌతాళం మండలం మేళగనూరు వద్ద ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తుంది. నదీ తీరంలో కొలువైన దేవాదిదేవతల పాదాలను అభిషేకిస్తూ.. సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలలోని నదుల్లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. తుంగభధ్ర నది కూడా జలకళతో కళకళలాడుతున్నది. భక్తులు స్నానాలు చేయడానికి కర్నూలు జిల్లాలో గతంలో 17 ఘాట్లను ఏర్పాటు చేశారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఆలంపూర్ లోనూ ఈ పుష్కరాలు జరుగుతాయి. కర్నూలులో.. మంత్రాలయం, సంగమేశ్వరం, కౌతాలం, గురజాల, పుల్లికల్, రాజోలి, నాగల దిన్నెలలో ఏర్పాట్లు చేయనున్నారు. ఈ పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక నుంచే గాక తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు.   ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్నాటకలోనూ  ఈ పుష్కరాలను ఘనంగా జరుపుకుంటారు.  ప్రముఖ పుణ్యక్షేత్రం సోమేశ్వర   ఆలయంతో పాటు శివమొగ్గ జిల్లా, బళ్లారి, చిక్ మంగళూరు జిల్లాలలోనూ  ఈ నది వెంబడి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల దగ్గర పుష్కర ఘాట్ లను ఏర్పాటు చేసేందుకు కర్నాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.   పన్నెండు రోజుల పాటు జరిగే  ఈ  వేడుకలకు సుమారు కోటి మంది దాకా హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు :

ఈ నేపథ్యంలో తుంగభద్ర పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నది. కరోనా కాలంలో వస్తున్న పుష్కరాలు కావున ప్రజలు.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా ఘాట్ల పెంపు, ప్రజలకు సౌకర్యాల కొరత రాకుండా చూసేందుకు గానూ కర్నూలు జిల్లాలో మంత్రులు, మునిసిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులతో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర, కార్మిక మంత్రి గుమ్మనూు జయరాంతో పాటు అధికారులు పాల్గొన్నారు.
Published by: Srinivas Munigala
First published: September 30, 2020, 1:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading