తిరుమల (Tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వెనకబడిన వర్గాలకు శ్రీవారి ప్రత్యేక (Special) దర్శనం కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని 13 జిల్లాల (distericts) నుంచి రోజుకు వెయ్యి మంది చొప్పున వెనుకబడిన వర్గాల (Backward classes) వారికి శ్రీవారి బ్రహ్మోత్సవ (Srivari Brahmotsavam) దర్శనం చేయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. టీటీడీ ఆలయాలు నిర్మించిన ప్రాంతాల్లోని వెనకబడిన వర్గాల (backward classes) ప్రజలకు శ్రీవారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనంతోపాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం కూడా టీటీడీ అధికారులు (TTD Officials) కల్పించనున్నారు. ఇలా దర్శనం చేసుకునే శ్రీవారి భక్తులకు ఉచిత రవాణా (Free Transport), భోజన (food), వసతి సౌకర్యాలను టీటీడీ అధికారులు కల్పించనున్నారు.
జిల్లాకు 10 బస్సులు..
ఒక్కో జిల్లా నుంచి 10 బస్సులు (buses) ఏర్పాటుచేసి భక్తులను ఉచితం (free)గా తిరుమలకు తీసుకురావడం జరుగుతుంది. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో 20 బస్సులు ఏర్పాటు చేయడమైనది. ఒక్కో బస్సు (bus)లో ఇద్దరు సమరసత సేవా ఫౌండేషన్ ప్రతినిధులు ఉంటారు. దూర ప్రాంతాల (long distance) నుండి వచ్చే భక్తులకు స్థానిక దాతల సహకారంతో భోజనాలు అందించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేపట్టింది.
బ్రహ్మోత్సవాల విశేషాలు
బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
06.10.2021 - బుధవారం - అంకురార్పణ - సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు..
07.10.2021 - గురువారం - ధ్వజారోహణం(మీనలగ్నం) - సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల వరకు. 08.10.2021 - శుక్రవారం - చిన్నశేష వాహనం -ఉదయం 9 నుంచి 10వరకు.. హంస వాహనం - రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
09.10.2021 - శనివారం - సింహ వాహనం -ఉదయం 9 నుంచి 10 గంటలకు వరకు.. స్నపనతిరుమంజనం- మధ్యాహ్నం 1 నుండి 3గంటల వరకు.. ముత్యపు పందిరి వాహనం - రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
10.10.2021 - ఆదివారం - కల్పవృక్ష వాహనం - ఉదయం 9 నుంచి 10 గంటలకు వరకు... స్నపనతిరుమంజనం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు.. సర్వభూపాల వాహనం - రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
11.10.2021 - సోమవారం - మోహినీ అవతారం - ఉదయం 9 నుంచి 10 గంటలకు వరకు.. గరుడసేవ - రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు..
12.10.2021 - మంగళవారం - హనుమంత వాహనం - ఉదయం 9 నుంచి 10 గంటలకు వరకు.. స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనం - సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు.. గజ వాహనం - రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
13.10.2021 - బుధవారం - సూర్యప్రభ వాహనం - ఉదయం 9 నుంచి 10 గంటలకు వరకు... స్నపన తిరుమంజనం - మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు.. చంద్రప్రభ వాహనం - రాత్రి 7 నుంచి 8 గంటల వరకు.
14.10.2021 - గురువారం - రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనం- ఉదయం 7.35 గంటలకు... అశ్వ వాహనం - రాత్రి 7 నుంచి 8 గంటల వరకు..
15.10.2021 - శుక్రవారం - పల్లకీ ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం - ఉదయం 6 నుంచి 8 గంటల వరకు.. స్నపనతిరుమంజనం మరియు చక్రస్నానం - ఉదయం 8 నుంచి 11 గంటల వరకు (అయిన మహల్లో).. ధ్వజావరోహణం - రాత్రి 8 నుంచి 9 గంటల వరకు..
13 జిల్లాల్లో 502 ఆలయాలు..
హిందూ (Hindu) ధర్మాన్ని ప్రచారం చేసేందుకు, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖతో కలిసి సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మొదటి విడతలో రూ.25 కోట్లతో 13 జిల్లాల్లో 502 ఆలయాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ఆలయాలు (temples) నిర్మించిన వెనుకబడిన ప్రాంతాల నుంచి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులను ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయించడం జరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.