Home /News /andhra-pradesh /

TTD TOOK KEY DECISIONS IN BOARD MEETING AS SRIVARI STEPS WAY TO REOPEN ON MAY 5TH FULL DETAILS HERE PRN TPT

TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై వారికీ ప్రత్యేక సౌకర్యాలు.. త్వరలో మెట్లమార్గం రీ ఓపెన్.. టీటీడీ కీలక నిర్ణయం..

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల (Tirumala) శ్రీవారి భక్తలకు టీటీడీ (TTD)శుభవార్త చెప్పింది. ఇకపై సామాన్య భక్తలకు మరింత వేగంగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం (Tirumala Darshan) కలిగేలా ఏర్పాట్లు చేస్తామని టీటీడీ ప్రకటించింది. శనివారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇంకా చదవండి ...
  తిరుమల (Tirumala) శ్రీవారి భక్తలకు టీటీడీ (TTD)శుభవార్త చెప్పింది. ఇకపై సామాన్య భక్తలకు మరింత వేగంగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేస్తామని టీటీడీ ప్రకటించింది. శనివారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల విలువైన భూమిని విరాళంగా ఇచ్చిందని టీటీడీ తెలిపింది. అలాగే శ్రీనివాస సేతు రెండో దశ పనులకు రూ.100 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మ‌రింత సౌక‌ర్య‌వంతంగా, వేగంగా ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టీటీడీలోని అన్నివిభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్నాయ‌ని తెలిపారు. దాదాపు రెండేళ్ల త‌రువాత అధిక సంఖ్య‌లో వచ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం స‌ర్వ దర్శనం, టైం స్లాటెడ్ దర్శనాలు కొనసాగిస్తామ‌న్నారు. న‌డ‌క దారి భ‌క్తుల‌కు త్వ‌ర‌లో టోకెన్లు జారీని ప్రారంభిస్తామ‌న్నారు.

  నవీ ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర‌ ప్రభుత్వం రూ.500 కోట్ల విలువైన 10 ఎక‌రాల భూమిని విరాళంగా ఇచ్చింద‌న్నారు. అక్క‌డ‌ శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.60 కోట్లు విరాళమిచ్చేందుకు దాత రేమండ్ సంస్థ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకొచ్చార‌న్నారు. ప్ర‌స్తుతం ముంబై న‌గ‌రంలో శ్రీ‌వారి ఆల‌యం కేవ‌లం వెయ్యి చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఇరుకైన ప్రాంతంలో రెండు ద‌శ‌బ్ధాలుగా ఉంద‌న్నారు. అటువంటిది ఇంత విశాల‌మైన ప్రాంగ‌ణంలో శ్రీ‌వారి ఆల‌యం నిర్మాణం జ‌ర‌గ‌డం చారిత్ర‌త్మ‌క‌మైనద‌న్నారు.

  ఇది చదవండి: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. రంజాన్ హాలిడేపై ప్రభుత్వం కీలక ప్రకటన..


  గ‌త ఏడాది కురిసిన భారీ వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న శ్రీ‌వారి మెట్టు మార్గాన్ని పునఃరుద్ధ‌రించి మే 5వ తేదీ నుండి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు కొత్త బంగారు సింహాసనాలకు బంగారు పూత పోయ‌డానికి రూపాయలు రూ.3.61 కోట్లతో టెండర్లు ఆహ్వానించేందుకు టీటీడీ ఆమోదం తెలిపింది. అలాగే శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలలో రూ.21.20 కోట్లతో ఇ మ‌రియు ఎఫ్ బ్లాకుల నిర్మాణానికి నిర్ణ‌యం తీసుకుంది.

  ఇది చదవండి: ఏలూరు జిల్లాలో టెన్షన్ టెన్షన్.. వైసీపీ నేత హత్య.. ఎమ్మెల్యేపై దాడి


  ఐఐటి నిపుణుల సూచ‌న‌ల మేర‌కు తిరుమ‌ల రెండు ఘాట్ రోడ్ల‌లో ఆర్‌సిసి రోడ్లు, క్రాష్ బ్యారియ‌ర్స్‌ నిర్మాణం కోర‌కు మొద‌టి ద‌శ‌లో రూ.20 కోట్లు, రెంద‌వ‌ ద‌శ‌లో రూ.15 కోట్ల‌తో పనులకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీనివాస సేతు రెండో దశ పనులకు రూ.100 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. 2023 మార్చి నాటికి రెండ‌వ ద‌శ ప‌నులు పూర్తి చేయాలని నిర్ణయించింది.

  ఇది చదవండి: వైసీపీలో ముదిరిన స్వామి భక్తి.. కీలక నేత ఎదుట మోకరిల్లిన మంత్రి..


  ఇక తిరుమల బాలాజీ నగర్ వ‌ద్ద‌ 2.86 ఎకరాల స్‌ంలం ఎలక్ట్రిక్ బస్ స్టేషన్‌కు ఏర్పాటుకుల చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో త‌డిచెత్త ద్వారా బ‌యో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు, టీటీడీ ఉద్యోగుల కోసం తిరుమ‌ల‌లో గ‌ల క్వార్ట‌ర్స్ అభివృద్ధి చేసేందుకు రూ.19.40 కోట్ల‌తో టెండ‌రకు ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు నగదు విరాళమిచ్చిన భక్తులకే ప్ర‌త్యేక సౌక‌ర్యాలు కల్పిస్తున్నామని., ఇకపై వ‌స్తు రూపంలో విరాళాలు అందించే దాత‌ల‌కు కూడా న‌గ‌దు రూపంలో విరాళాలు అందించే దాత‌ల త‌ర‌హాలో ప్ర‌యోజ‌నాలు వర్తింపజేయాలని టీటీడీ నిర్ణయించింది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు