శ్రీవారి లడ్డూలపై... టీటీడీ మరో నిర్ణయం..
శ్రీవారి లడ్డూ ధర పెంచే ఆలోచన తమకు లేదని క్లారిటీ ఇచ్చిన టీటీడీ... తాజాగా లడ్డూ కవర్ల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.
news18-telugu
Updated: November 18, 2019, 8:48 PM IST

లడ్డూ ప్రసాదం
- News18 Telugu
- Last Updated: November 18, 2019, 8:48 PM IST
శ్రీవారి లడ్డూ ధర పెంచే ఆలోచన తమకు లేదని క్లారిటీ ఇచ్చిన టీటీడీ... తాజాగా లడ్డూ కవర్ల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి వడివడిగా అడుగులు వేస్తున్న టీటీడీ... ఈ క్రమంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. లడ్డు, ఇతర ప్రసాదాలను అందించడానికి జ్యూట్ బ్యాగులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు బార్ కోడ్ విధానం ద్వారా లడ్డులు అందిస్తామని.. దర్శనం చేసుకున్న వారికే లడ్డులు అందిస్తామని టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి గతంలో వెల్లడించారు. దీనికి కొనసాగింపుగానే తాజాగా లడ్డు కవర్లను నిషేధించారు. వాటికి ప్రత్యామ్నాయంగా పేపర్ బాక్స్‌లు ప్రవేశపెట్టారు. మరోవైపు వసతి గృహాల వద్ద వాటర్ కూలర్లు ఏర్పాటు చేయనున్నారు.
తిరుమలలో దుమారం రేపుతున్న బోర్డు మెంబర్ వ్యవహారం...
తిరుమల భక్తులకు శుభవార్త... 10రోజులపాటు వైకుంఠ దర్శనం
Video:శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే..
Tirupati Special Train: తిరుపతి వెళ్లేవారికి శుభవార్త... రెండు ప్రత్యేక రైళ్లు
రేపటి నుంచి తిరుచానూర్ అమ్మవారి బ్రహ్మోత్సవాలు..
మంత్రి కొడాలి నానిపై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు
Loading...