తిరుమల శ్రీవారి లడ్డూలపై టీటీడీ కీలక నిర్ణయం

వీటితో పాటు పేపర్ కప్పులను వినియోగంలోకి తెస్తోంది టీటీడీ. వచ్చే సంక్రాంతి లోపు దశలావారీగా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని ప్లాన్ చేస్తోంది.

news18-telugu
Updated: November 18, 2019, 10:17 PM IST
తిరుమల శ్రీవారి లడ్డూలపై టీటీడీ కీలక నిర్ణయం
లడ్డూ ప్రసాదం
  • Share this:
తిరుమల కొండలపై ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిషేధించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు ప్రారంభించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఇకపై ప్లాస్టిక్ కవర్లలో ఇవ్వకుండా పేపర్ బాక్స్, జూట్ బ్యాగ్ (జనపనార సంచి)లను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై శ్రీవారి లడ్డూలను కాగితపు పెట్టెల్లో పెట్టి భక్తులకు అందజేస్తారు. వీటితో పాటు పేపర్ కప్పులను వినియోగంలోకి తెస్తోంది టీటీడీ. వచ్చే సంక్రాంతి లోపు దశలావారీగా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని ప్లాన్ చేస్తోంది. ఇక తిరుమల కొండపై ఉన్న అన్ని అతిథి గృహాల్లో నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు స్వచ్ఛమైన మంచి నీరు అందించడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నారు.

First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>