టీటీడీ లోని1400 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త?

కోవిడ్ 19 కారణంగా రూ. 3 వేల కోట్లకుపైనే ఉంటే టీటీడీ వార్షిక బడ్జెట్... రూ. 2 వేల కోట్లకు దిగిరానుంది.

టీటీడీలో తొలగించిన 1400 మంది కార్మికులను మళ్లీ విధులకు హాజరుకావాలని సందేశం పంపినట్టు తెలిసింది.

  • Share this:
    తిరుమల తిరుపతి దేవస్థానంలో తొలగించిన 1400 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులను రేపటి నుంచి తిరిగి విధుల్లోకి రావాలని సూపర్వైజర్లకు, కార్మికులకు అధికారుల వర్తమానం అందినట్టు సమాచారం. టీటీడీలో 15 సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ కార్మికులుగా, సూపర్వైజర్ లుగా పనిచేస్తున్న 1400 మందిని తొలగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే, వారిని రేపటి నుంచి తిరిగి యధావిధిగా విధుల్లోకి తీసుకుంటూ, నెల రోజులు ప్రస్తుతమున్న కాంట్రాక్ట్ గడువు పొడిగిస్తూ టిటిడి ఉన్నతాధికారుల నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

    అంతకుముందు 1400 మంది కార్మికుల పొట్ట కొట్టొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ కారణంగా దేశంలోని అల్పాదాయ వర్గాల వారు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో టీటీడీలో పనిచేస్తున్న 1400 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం తీవ్రమైన అన్యాయం అని అన్నారు. దేశంలో ఏ ఒక్క కార్మికుడినీ ఉద్యోగాల నుంచి తొలగించరాదని, వారికి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిస్తే, టీటీడీ పెద్దలు ఒక్క కలం పోటుతో 1400 మంది కార్మికులను విధుల నుంచి తొలగించడం సహేతుకం కాదన్నారు. తొలగింపునకు గురైన వారంతా సుమారు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, తక్కువ వేతనాలు పొందుతున్న వారేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. టీటీడీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వారందరినీ కొనసాగించాలని బోర్డుకి, ఈవోకి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: