Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త..

    Tirumala Temple | జూలై 23న వృద్ధులు, దివ్యాంగులకు, జూలై 24న చంటిపిల్లల తల్లిదండ్రులకు "శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం." కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.

    news18-telugu
    Updated: July 18, 2019, 9:51 PM IST
    తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త..
    రంగుల రంగుల పూలతో ముస్తాబైన శ్రీవారి ఆలయం
    • Share this:
    శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త అందించింది. జూలై 23న వృద్ధులు, దివ్యాంగులకు, జూలై 24న చంటిపిల్లల తల్లిదండ్రులకు "శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం."
    కల్పించాలని నిర్ణయించింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో (శని, ఆదివారాలు కాకుండా, ప్రత్యేక తిథులు కాకుండా) వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది.  ఇందులో భాగంగా జూలై 23వ తేదీ మంగ‌ళ‌వారం వయోవృద్ధులు (65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

    ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.

    5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను జూలై 24వ తేదీ బుధ‌వారం ఉద‌యం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను జూలై 24న సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి  సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
    Published by: Ashok Kumar Bonepalli
    First published: July 18, 2019, 9:50 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading