హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: శ్రీవారి ఆలయంలో ఒక్క రోజు బ్రహ్మోత్సవం.. ఇలా ఎందుకో తెలుసా..?

Tirumala: శ్రీవారి ఆలయంలో ఒక్క రోజు బ్రహ్మోత్సవం.. ఇలా ఎందుకో తెలుసా..?

కరోనా (Corona) ప్రభావం తిరుమల (Tirumala) లో నిర్వహించే సూర్యజయంతి వేడుకలపై ఎఫెక్ట్ పడింది.‌ ఏటా శ్రీవారి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలను కరోనా నిబంధనలను పాటిస్తూ వేడుకలను నిర్వహించేందుకు టీటీడీ TTD) సిద్ధమవుతోంది.

కరోనా (Corona) ప్రభావం తిరుమల (Tirumala) లో నిర్వహించే సూర్యజయంతి వేడుకలపై ఎఫెక్ట్ పడింది.‌ ఏటా శ్రీవారి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలను కరోనా నిబంధనలను పాటిస్తూ వేడుకలను నిర్వహించేందుకు టీటీడీ TTD) సిద్ధమవుతోంది.

కరోనా (Corona) ప్రభావం తిరుమల (Tirumala) లో నిర్వహించే సూర్యజయంతి వేడుకలపై ఎఫెక్ట్ పడింది.‌ ఏటా శ్రీవారి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలను కరోనా నిబంధనలను పాటిస్తూ వేడుకలను నిర్వహించేందుకు టీటీడీ TTD) సిద్ధమవుతోంది.

  GT Hemanth Kumar, Tirupathi, News18

  కరోనా (Corona) ప్రభావం తిరుమల (Tirumala) లో నిర్వహించే సూర్యజయంతి వేడుకలపై ఎఫెక్ట్ పడింది.‌ ఏటా శ్రీవారి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలను కరోనా నిబంధనలను పాటిస్తూ వేడుకలను నిర్వహించేందుకు టీటీడీ TTD) సిద్ధమవుతోంది. అయితే టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఏకాంతంగా రథ సప్తమి వేడుకలను అధికారులు నిర్వహించనున్నారు. అఖిలాండ‌కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైయున్న తిరుమలలో వార్షికోత్సవాలలో రథసప్తమి అతి ముఖ్యమైనది. ఈ రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవంగా కూడా పిలుస్తారు. బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల్లో జరిగే వాహన సేవలు రథసప్తమి ఒక్కరోజే పలు వాహన సేవలపై శ్రీవారు భక్తులకి దర్శనం ఇస్తారు.. అందుకే దీనిని మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తారు..‌ కోవిడ్ ఉధృతి కారణంగా ఈ ఏడాది రథ సప్తమి వేడుకలను ఏకాంతంగా జరపాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

  ఫిబ్రవరి 8న సూర్య జయంతి పర్వదినం పురస్కరించుకుని ప్రతి ఏడాది శ్రీవారి ఆలయంలీ రథసప్తమి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తొంది. గత ఏడాది ఆలయం వెలుపల వాహన సేవలు ఊరేగింపుగా టీటీడీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సారి ఏకాంతంగా శ్రీవారి ఆలయంలోనే స్వామి వారికి వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది. ఫిబ్రవరి 8వ తేదీన ఉదయం నుండి రాత్రి వరకు శ్రీవారు సప్తవాహనాల్లో మాడ వీధుల్లో ఊరేగనున్నారు. రథసప్తమి వేడుకలు ఆ రోజు ఉదయం సూర్యప్రభ వాహనసేవతో ప్రారంభమై చిన్నశేష వాహనం, గరుడ వాహన సేవ, హనుమంత వాహనసేవ, కల్పవృక్ష వాహన సేవ, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనం ఉరేగింపుతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి.‌ రధసప్తమి నాడు మధ్యాహ్నం శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవంను శ్రీవారి ఆలయంలోనే ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు.

  ఇది చదవండి: ఫ్లైట్ లో తిరుపతికి వెళ్తున్నారా..? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే..! శ్రమలేకుండానే శ్రీవారి దర్శనం..


  కోవిడ్ థర్డ్ వేవ్ రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దీంతో భక్తులు, సిబ్బంది ఆరోగ్య భధ్రత దృష్ట్యా ఇప్పటికే తిరుమలలో కోవిడ్ నిబంధనలు పటిష్ఠం చేసింది టీటీడీ. ఈ క్రమంలోనే‌ శ్రీవారి దర్శనానికి రావాలంటే కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ గానీ, లేదా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ ని తప్పనిసరిగా చేసింది టీటీడీ. అలిపిరి తనిఖీ కేంద్రం, దర్శనానికి వెళ్లే క్యూలో వీటిని పరిశీళించిన తరువాతే భక్తులను స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతిస్తోంది. మాస్క్ లేనిదే దర్శనానికి అనుమతి లేదని సిబ్బందితో భక్తులకు అవగాహన కల్పిస్తుంది టీటీడీ.

  ఇది చదవండి: శ్రీవారి దర్శనానికి కొత్త విధానం.. టీటీడీ ఆలోచన వర్కవుట్ అవుతుందా..?


  దీంతో పాటు ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే తిరుమల రావద్దంటు టీటీడీ పదే పదే భక్తులను కోరుతుంది. కోవిడ్ ముందు వరకూ రోజుకి లక్ష మంది వరకూ భక్తులు తిరుమలకి వచ్చేవారు. అయితే కరోనా కారణంగా ప్రస్తుత్తం రోజుకి 30 మంది భక్తులు మాత్రమే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. రథసప్తమి వేడుకలు కారణంగా తిరుమలో అధిక సంఖ్యలో భక్తులు గుమికూడే అవకాశాలు ఉండడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా టీటీడీ ఏకాంతంగా నిర్వహించారు. కానీ రథసప్తమి వేడుకలు ఇప్పటి వరకు ఆలయం వెలుపల అంగరంగ వైభవంగా జరిగేవి.

  ఇది చదవండి: మరో వివాదంలో టీటీడీ.. ఉదయాస్తమాన సేవా టికెట్లపై కాంట్రవర్సీ..


  గత ఏడాది కూడా కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో రథసప్తమి వేడుకలు ఆలయం వెలుపలే నిర్వహించారు. కానీ మొదటి సారి ఫిబ్రవరిలో జరిగే రథసప్తమి కూడా ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయిస్తోంది. సూర్య జయంతి సందర్భంగా ఉదయం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేషవాహనంపై, ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై మలయప్ప స్వామి వారు కొలువుదీరనున్నారు.

  ఇది చదవండి: శ్రీవారి ఆలయం గురించి ఈ విశేషాలు తెలుసా..? అడుగడుగునా గోవిందుడి ప్రతిరూపాలే..!


  అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహనంపై, మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆలయ రంగనాయకుల మండపంలో ఏకాంతంగా చక్ర స్థానం మహోత్సవాన్ని ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు. ఆ తరువాత సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనంపై 6 గంటల నుండి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై, తర్వాత చివరి వాహనముగా రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనంపై మలయప్ప స్వామి వారు భక్తులను కటాక్షించనున్నారు. సూర్య జయంతి ఈ సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణలను టీటీడీ రద్దు చేసింది.

  First published:

  Tags: Andhra Pradesh, Tirumala Temple, Tirumala tirupati devasthanam

  ఉత్తమ కథలు