హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Hanuman Birthplace: తిరుమలలో హనుమంతుడి వైభవం.. యాదాద్రి తరహా ఆలయ నిర్మాణం.. విశేషాలివే..!

Hanuman Birthplace: తిరుమలలో హనుమంతుడి వైభవం.. యాదాద్రి తరహా ఆలయ నిర్మాణం.. విశేషాలివే..!

త్రేతాయుగంలో ఆంజనేయునికి అంజనీ దేవి. ఈ పర్వతాలపై జన్మనివ్వడంతో అంజనాద్రి పర్వతంగా పేరొందింది. తిరుమలలోని ఆకాశగంగే హనుమ జన్మస్థలం అంటూ టీటీడీ (TTD) ఇదివరకే భౌగోళిక, శాస్త్రీయ, పౌరాణిక, ఇతిహాస, వేదాల ద్వారా రుజువు చేసింది.

  GT Hemanth Kumar, Tirupathi, News18

  అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడు కొలువైన దివ్య క్షేత్రం తిరుమల (Tirumala Temple). శేషాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, వేంకటాద్రి పర్వతాలుగా తిరుమల కొండ విరాజిల్లుతోంది. త్రేతాయుగంలో ఆంజనేయునికి అంజనీ దేవి. ఈ పర్వతాలపై జన్మనివ్వడంతో అంజనాద్రి పర్వతంగా పేరొందింది. తిరుమలలోని ఆకాశగంగే హనుమ జన్మస్థలం అంటూ టీటీడీ (TTD) ఇదివరకే భౌగోళిక, శాస్త్రీయ, పౌరాణిక, ఇతిహాస, వేదాల ద్వారా రుజువు చేసింది. వేంకటాచల మహత్యం, మునులు మహర్షులు రాసిన ఇతర గ్రంధాల్లోని అధరాలు చూపింది టీటీడీ. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న హనుమ జన్మస్థలాలుగా పేరు గాంచిన పుణ్యక్షేత్రాలకు దీటుగా తిరుమలలో హనుమ వైభవాన్ని పెంపొందించేలా టీటీడీ మరో అడుగు ముందుకు వేస్తోంది. హనుమ జన్మస్థలమైన ఆకాశ గంగ తీర్థ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది టీటీడీ. భూమి పూజకు సంబంధిన కార్యక్రమాలను శరవేగంగా ఏర్పాట్లను టీటీడీ అధికారులు పూర్తి చేస్తున్నారు.

  ఆకాశగంగలోని హనుమంతుడి జన్మస్థలానికి ఫిబ్రవరి 16న మాఘ పౌర్ణమి రోజు టీటీడీ భూమిపూజ చేయనుంది. ఆకాశగంగ వద్ద భూమిపూజ ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఆకాశగంగ సమీపంలోని అంజనాద్రి ఆంజనేయస్వామి జన్మస్థలమని భౌగోళిక, పౌరాణిక, శాస్త్రీయ ఆధారాలతో టీటీడీ ధర్మకర్తల మండలి సైతం ఆమోద ముద్ర వేసింది. భూమి పూజ కార్యక్రమాన్ని ఉదయం 9.30 గంటల 11 గంటల నడుమ నిర్వహించనున్నారు.

  ఇది చదవండి: పార్లమెంట్ లో కాపు రిజర్వేషన్ అంశం.. జగన్ సర్కార్ పై బీజేపీ బౌన్సర్..! బాబుకూ కౌంటర్..!

  ఈ కార్యక్రమానికి విశాఖ శారదపీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి, అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్‌దేవ్‌ గిరి మహారాజ్‌, చిత్రకూట్‌ పీఠాధిపతి రామభద్రాచార్యులు, కోటేశ్వరశర్మ తదితర ఆధ్యాత్మిక ప్రముఖులు హాజరుకానున్నారు. హనుమ వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు హనుమంతుడి జన్మవృత్తాంతంపై పుస్తకాన్ని కూడా విడుదల చేయనున్నారు. అంజనాదేవి, బాలాంజనేయస్వామి ఆలయం ముందు ముఖ మండపం, గోపురాలు, గోగర్భం డ్యాం వద్ద రోటరీ దాతల సహకారంతో ఏర్పాటు చేయనున్నారు.

  ఇది చదవండి: వైజాగ్ లో మరో బెస్ట్ టూరిస్ట్ స్పాట్.., చూస్తే వదిలిపెట్టరు..

  ఇక హనుమ జన్మ స్థల వైభవం తెలియాలంటే సాధారణంగా ఆలయం మాములుగా ఉంటె సరిపోదని భావించింది టీటీడీ. యాదాద్రి ఆలయం తరహాలో హనుమ ఆలయ నిర్మాణానికి నంది పలికింది. యాత్రికులకు హనుమ జన్మ రహస్యం ప్రతిభింభించేలా ఆలయ నిర్మాణానికి సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో డిజైన్ రూపొందించనున్నారు. పాలకమండలి మాజీ సభ్యులు నాగేశ్వరరావు, మురళీకృష్ణ ఆర్థిక సహాయంతో ఈ ఆలయ నిర్మాణం సాగనుంది. యద్రాద్రి నరసింహ స్వామి వారి ఆలయం తరహాలో ఉండేలా ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి సుందరీకరణ చేపట్టేందుకు భూమిపూజ చేస్తున్నట్లు టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి మీడియాతో వెల్లడించారు.

  First published:

  Tags: Andhra Pradesh, Tirumala Temple

  ఉత్తమ కథలు