TTD TO IMPLEMENT NEW DARSHAN SCHEME FOR NRI AT TIURMALA TEMPLE FULL DETAILS HERE PRN TPT
TTD News: ఎన్ఆర్ఐ భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ.... మరింత సులభంగా శ్రీవారి దర్శనం.. వివరాలివే..!
తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)
ఏడుకొండల్లో కొలువైన బ్రహ్మాండ నాయకుడి దర్శన భాగ్యం కలగాలంటే అదృష్టం ఉండాలని అంటారు. శ్రీవారి దర్శనానికి తిరుమలకు (Tirumala Temple) వచ్చిన ఆయన అనుగ్రహం లేనిదే దర్శన భాగ్యం కలగదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుండి భక్తులు తిరుమలకి చేరుకొని దర్శనభాగ్యం (Tirumala Darshan) పొందుతుంటారు.
ఏడుకొండల్లో కొలువైన బ్రహ్మాండ నాయకుడి దర్శన భాగ్యం కలగాలంటే అదృష్టం ఉండాలని అంటారు. శ్రీవారి దర్శనానికి తిరుమలకు (Tirumala Temple) వచ్చిన ఆయన అనుగ్రహం లేనిదే దర్శన భాగ్యం కలగదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుండి భక్తులు తిరుమలకి చేరుకొని దర్శనభాగ్యం (Tirumala Darshan) పొందుతుంటారు. స్వామి వారి క్యూలైన్ లో ప్రవేశించిన అనంతరం పేద, ధనిక అనే భేధం లేకుండా గంటల తరబడి వేచి ఉండి క్షణకాలం పాటు స్వామి వారి దివ్య మంగళ స్వరూపాన్ని కన్నులార వీక్షించాల్సిందే. సప్తగిరులకు ప్రపంచ నలుమూల నుండి వచ్చిన భక్తుల గోవింద నామ స్మరణలతో మారుమ్రోగుతూ ఉంటుంది. ఎటు చూసినా భక్త జనంతో తిరుమలగిరులు భక్తజన సంద్రంతో కిటకిట లాడుతుంది.
స్వామి వారిని వారి వారి తాహతకు తగ్గట్టుగా భక్తులు సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వి.ఐ.పీ బ్రేక్, ఆర్జిత సేవ వంటి రూపాల్లో స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే గత ఏడాది ఎవరూ ఊహించని విపత్తు కరోనా రూపంలో వచ్చి ప్రపంచ మానవాళిని కుదిపేసింది. కరోనా వ్యాప్తి నేపధ్యంలో దాదాపు ఎనభై రోజుల పాటు టిటిడి భక్తుల అనుమతిని రద్దు చేసింది. ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తూ వస్తొంది టిటిడి.
అయితే పూర్తి స్ధాయిలో కోవిడ్ అదుపులోకి రావడంతో ఎటువంటి ఆంక్షలు లేకుండా భక్తులను కొండపైకి అనుమతిస్తూ స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తోంది టీటీడీ. ఈ క్రమంలో గతంలో లాగానే రద్దు చేసిన వివిధ రకాల దర్శన విధి విధానాలను తిరిగి పునఃప్రారంభిస్తోంది.
కోవిడ్ తరువాత ఎటువంటి ఆంక్షలు లేకుండా తిరుమలకు అనుమతిస్తున్న క్రమంలో ఏడుకొండలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. గత రెండేళ్ళుగా స్వామి వారిని దర్శించుకోలేని భక్తులు ఒక్కసారిగా తిరుమలకు చేరుకోవడంతో సప్తగిరుల్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ టిటిడి తీసుకుంటున్న నిర్ణయాలు భక్తుల వద్ద నుండి విశేష స్పందన వస్తొంది.
గత రెండు సంవత్సరాలుగా రద్దు చేసిన ఎన్నారై దర్శనాలను తిరిగి ప్రారంబిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రవాస భారతీయులకు తీపి కబురు చెప్పినట్లయింది. ప్రవాస భారతీయులకు స్వామి వారి దర్శన భాగ్యం విషయంలో టిటిడి కొన్ని వెలుసుబాటు కల్పించిన క్రమంలో ఇకపై గతంలో మాదిరిగానే తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద గల ప్రత్యేక ప్రవేశ మార్గం వద్ద ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను తిరిగి ప్రారంబిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవాసాంధ్ర 90 రోజుల వ్యవధిలో తమ పాస్ పోర్టును చూపించి దర్శన భాగ్యం పొందే వెసులు బాటు కల్పించింది టిటిడి. వీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ప్రత్యేక ప్రవేశ మార్గంలో ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకూ ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.